అప్పుడు త్రివిక్రమ్.. ఇప్పుడు సుకుమార్..నిజంగానే రైటర్స్ కి అన్యాయం జరుగుతుందా ?

సినిమా రచయితలను దర్శకులు పొగడటం చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది.వారిలోని గొప్పతనాన్ని ఆకాశానికి ఎత్తేలా ప్రశంసించడం మాత్రం చాలా తక్కువ.

 Is Seriously Writers Are Recived Unfair Status In Tollywood Details, Chandrabose-TeluguStop.com

కానీ కొందరు దర్శకులు రచయితలకు ఇచ్చే అసాధారణ గౌరవం నిజంగా అద్భుతం అనిపిస్తుంది.పుష్ప సినిమా థ్యాంక్స్ మీట్ లో ఎమోషన్ ఏరులైపారింది.

నటులు, టెక్నీషియన్లు, సెలబ్రిటీల ఎమోషనల్ జర్నీ అందరినీ ఆకట్టుకుంది.అల్లు అర్జున్, సుకుమార్, చంద్రబోస్ తమ అనుభవాలను ఎమోషనల్ ను జోడించి షేర్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా రచయిత చంద్రబోస్ కాళ్లను దర్శకుడు సుకుమార్ మొక్కడం సంచలనం అయ్యింది.సినిమాకు దర్శకుడు మెయిన్.

ఒక సినిమా విజయం సాధిస్తే.అందరికీ పేరొస్తుంది.

అందరికీ ఆ క్రెడిట్ ఇచ్చిన ఘనత దర్శకుడికి మిగులుతుంది.అందరూ దర్శకుడికే ధన్యవాదాలు చెప్తారు.

కానీ ఓ దర్శకుడు రచయిత గొప్పతనాన్ని పొగిడి అతడి కాళ్లకు నమస్కరించడం అనేది మామూలు విషయం కాదు.అలాగే చంద్రబోస్ లోని సాహితీ శక్తి, స్పాంటేనిటీ, జ్ఞాపకశక్తి, ప్రతిభ అమోఘమంటూ ఆయన కాళ్లకు నమస్కరించాడు దర్శకుడు సుకుమార్.

చంద్రబోస్.పదాలను అవలోకగా రాస్తాడని చెప్పాడు.

ఈ సందర్భంగా ఆయనను సీతారామ శాస్త్రితో పోల్చారు.

కొంతకాలం క్రితం ఓ అవార్డుల వేడుకలో సిరివెన్నెల గొప్ప తనాన్ని గురించి దర్శకుడు త్రివిక్రమ్ సైతం చాలా గొప్పగా మాట్లాడాడు.

Telugu Allu Arjun, Chandra Bose, Chandrabose, Sukumar, Writers, Pushpa, Meet, To

సినిమా రచయితలకు సరైన గౌరవం దక్కడం లేదని త్రివిక్రమ్ వెల్లడించాడు.సిరివెన్నెల లాంటి రైటర్లు తెలుగు సినిమా పరిశ్రమలో ఉండటం వారి దురదృష్టమని చెప్పాడు.అయితే ఇక్కడి ప్రజల అదృష్టమని ఆయన వెల్లడించాడు.

Telugu Allu Arjun, Chandra Bose, Chandrabose, Sukumar, Writers, Pushpa, Meet, To

సీతారామశాస్త్రి రచనా ప్రతిభ గురించి చెప్పటానికి తన వొకాబులరీ.తనకున్న భాషా పరిజ్ఞానం సరిపోదంటూ గొప్పగా పొగిడేశాడు.అయితే ఓ సినిమా రచయిత గురించి దర్శకుడు ఇంతలా ప్రశంసించడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు.

ఈ అరుదైన గౌరవం ఇచ్చిన దర్శకులు త్రివిక్రమ్, సుకుమార్.నిజంగా గొప్పవారు అని చెప్పక తప్పదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube