ఈటెల గెలుపు కోసం రేవంత్ అంతటి త్యాగానికి సిద్దపడ్డారా?

Is Rewanth Willing To Sacrifice Everything For The Victory Of The Etela

ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు గెలుస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.టీఆర్ఎస్ నుండి బయటికి రావడంతో హుజూరాబాద్ కు ఉప ఎన్నిక వచ్చిందన్న విషయం తెలిసిందే.

 Is Rewanth Willing To Sacrifice Everything For The Victory Of The Etela-TeluguStop.com

అయితే ప్రస్తుతం హుజూరాబాద్ లో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు పోటీలో కీలకంగా ఉన్నా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా బీజేపీకి మద్దతిస్తున్నదని అందుకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ లో గెలవదని ప్రకటించారని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే తాజాగా కెటీఆర్ రేవంత్ పై చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి కాంగ్రెస్ మద్దతు పలుకుతుందోన్న వ్యాఖ్యలకు మరింత ఊతమిస్తున్న పరిస్థితి ఉంది.రేవంత్ రెడ్డి ఈటెల కొరకు తన పార్టీ ప్రతిష్టను తాకట్టుపెట్టి మరీ ఈటెల గెలిచేందుకు సహకరిస్తున్నారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున సాగుతోంది.

 Is Rewanth Willing To Sacrifice Everything For The Victory Of The Etela-ఈటెల గెలుపు కోసం రేవంత్ అంతటి త్యాగానికి సిద్దపడ్డారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే హుజూరాబాద్  ఉప ఎన్నిక తరువాత ఈటెల కాంగ్రెస్ లో చేరికకు హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలలో బలమైన చర్చ జరుగుతోంది.అందుకే కెటీఆర్ కూడా రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ కలయికపై ఈ ఉప ఎన్నిక జరగనున్న సందర్భంలో వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే ఈటెల కూడా రేవంత్ తో సమావేశం పట్ల క్లారిటీ ఇవ్వడంతో బీజేపీ కూడా ఒక్కసారిగా ఆలోచనలో పడింది.ఎన్నికలు ఒక పార్టీ ఇంకొక పార్టీకి మద్దతు పలకడం అన్నది అసంభవం.ఒకవేళ చేసిన బహిరంగ ఒప్పందం ద్వారానే జరుగుతాయి తప్ప అంతర్గత చర్చలతో రహస్య సమావేశాలతో  ఉండే పరిస్థితి ఒకప్పుడు లేదు.ప్రస్తుతం ఇలా జరగడం చాలా సర్వసాధారణం అయిపోయింది.

ఏది ఏమైనా ఈటెల తన గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న పరిస్థితి ఉంది.

#Telangana #Huzurabad #Etela Rajender #Balmuri Venkat #Poltics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube