కాంగ్రెస్‌లో నల్గొండ నేతల ప్రభావాన్ని రేవంత్ తగ్గిస్తున్నా‌రా?

టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చిన సంగతి అందరికీ విదితమే.

 Is Rewanth Reducing The Influence Of Nalgonda Leaders In Congress?, Revanth, Con-TeluguStop.com

కాగా, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకుగాను రేవంత్ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతల ప్రభావాన్ని తగ్గిస్తున్నారనే గుసగుసలూ వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో అందుకే వారికి ఎవరికి స్థానం ఇవ్వలేదనే చర్చ జోరుగానే నడుస్తున్నది.ఒకప్పుడు నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన సందర్భాలు చరిత్ర తిరగేసి చూస్తే కనిపిస్తాయి.

మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఉన్న నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అంత చురకుగా కనబడటం లేదనే వార్తలు వస్తున్నాయి.ఇక రాష్ట్ర, నల్లగొండ రాజకీయాల్లో తమదైన పట్టును నిలుపుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ ప్రభావాన్ని రేవంత్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

వీరికి కూడా కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో స్థానం లేదనేది వాస్తవమే.అయితే, వీరిరువురు అన్నదమ్ములు తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాలు జోరుగానే చేస్తున్నారు.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి ఎంపీగా తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో సమీక్షా సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూనే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు.

Telugu Congress, Komati Reddy, Nalgonda, Pcc, Raj Gopal Reddy, Revanth, Ts Congr

ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం మునుగోడు ప్రజలకు ఎల్లవేళలా అవెయిలబుల్‌గా ఉంటున్నారు.అయితే, కాంగ్రెస్‌లో నల్లగొండ నేతల ప్రాభవాన్ని తగ్గించడానికి రేవంత్ నిజంగానే ప్రయత్నిస్తున్నారా? అనేది ఇంకొద్ది రోజుల తర్వాత బయటపడే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే రాష్ట్ర కార్యక్రమాల్లో నల్లగొండ నేతలకు ప్రాధాన్యత ఉంటుందా? ఉండదా? అనే అంశాలు కీలకంగా మారుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube