రేవంత్ రెడ్డి గెలుపు డౌటేనా..అందుకే..!!!

కోడంగల్ కోటకి బీటలు వారడం ఖాయమేనా.?? రేవంత్ రెడ్డి కి సొంత నియోజక వర్గం ప్రజలు షాక్ ఇవ్వనున్నారా.?? టీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందా.?? కేసీఆర్ వలలో రేవంత్ చిక్కుకున్నాడా.?? అంటే అవుననే జవాబులు వస్తున్నాయి.ఎందుకంటే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి తన ప్రసంగాలలో చేస్తున్న వ్యాఖ్యలు అందుకు నిదర్సనంగా కనిపిస్తున్నాయి.

 Is Revanth Reddy Will Win At Kodangal In 2018 Elections-TeluguStop.com

రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు కాబట్టే ఈ రకమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు.ఇంతకీ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల తాలూకు మర్మం ఏమిటనే వివరాలలోకి వెళ్తే.

తెలంగాణలో ఎన్నికల నగారా మొగినప్పటి నుంచీ కేసీఆర్ టార్గెట్ ఒకే ఒక్క కోడంగల్ నియోజకవర్గం.ఆ స్థానం నుంచీ రేవంత్ రెడ్డి ని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు.అందులో భాగంగానే తన మేనల్లుడు హరీష్ కి రేవంత్ రెడ్డి ని ఓడించే భాద్యతలని అప్పగించాడు.రేవంత్ దిమ్మతిరిగేలా వ్యూహ ప్రతి వ్యుహాలని హరీష్ అమలు చేయడంలో సక్సెస్ అవుతున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే.

కోడంగల్ ప్రజలు ఏదన్నా చిన్న సమస్య వచ్చినా సరే హరీష్ ఏర్పాటు చేసిన టీం వద్దకే వెళ్తున్నార.

అంతేకాదు ఎటువంటి చిన్న సమస్య వారి దృష్టికి వచ్చినా హరీష్ ఆఘమేఘాల మీద పరిష్కరిస్తున్నారని కూడా తెలుస్తోంది.దాంతో ఇప్పుడు కొందంగల్ ప్రజలు తమ నిర్ణయాలని మార్చుకుంటున్నారని టాక్ కూడా వినిపిస్తోంది.

అందుకే రేవంత్ రెడ్డి కొన్ని రోజులుగా చేస్తున్న ప్రసంగాలలో కొంచం తడబడుతున్నాడని అంటున్నారు విశ్లేషకులు.

కొడంగల్ ప్రజల అండతో కొండనైనా “ఢీ” కొడతాను.అది చేస్తాను ఇది చేస్తాను అంటూ ప్రజలని తనవైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.అంతేకాదు వందమంది కేసీఆర్ లు వచ్చినా సరే కోడంగల్ ప్రజలు నా వెంటే ఉంటారు అంటూ తనలో ఉన్న భయాన్ని తనంతట తానే బయటపెట్టుకుంటున్నారు అంటున్నారు పరిశీలకులు.

అందుకే ప్రజలందరూ నావెంటే అంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారని మొత్తానికి రేవంత్ భయపడుతున్నాడని అంటున్నారు రాజకీయ పండితులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube