ఏంటీ... అనుపమ బాయ్ ఫ్రెండ్ తో రష్మిక డేటింగ్ చేస్తోందా... ?  

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు మరియు ఇంటర్నెట్ సౌకర్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటంతో సెలబ్రిటీల గురించి ఏదైనా విషయం తెలిస్తే ఏమాత్రం ఆలస్యం కాకుండా ఇట్టే  వైరల్ అవుతుంది.  దీంతో అప్పుడప్పుడు పలు ఇన్ఫర్మేటివ్ వెబ్ సైట్లలో సెలబ్రిటీల గురించి ఏదైనా చిన్న తప్పు జరిగినా కొందరు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ ప్రచారాలు చేస్తుంటారు.

TeluguStop.com - Is Rashmika Mandanna Dating With Anupama Parameswaran Boyfriend

 కాగా తాజాగా ఓ ప్రముఖ ఇన్ఫర్మేటివ్ వెబ్ సైట్ లో అనుపమ పరమేశ్వరన్ బాయ్ ఫ్రెండ్ తో కన్నడ బ్యూటీ రష్మిక మందాన డేటింగ్ చేస్తున్నట్లు ప్రచురించింది.

దీంతో ప్రస్తుతం ఈ విషయం నెట్లో తెగ హల్చల్ చేస్తోంది.

TeluguStop.com - ఏంటీ… అనుపమ బాయ్ ఫ్రెండ్ తో రష్మిక డేటింగ్ చేస్తోందా… -Gossips-Telugu Tollywood Photo Image

 అంతేగాక ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్లు అనుపమ పరమేశ్వరన్ బాయ్ ఫ్రెండ్ తమిళ్ ప్రముఖ యానిమేటెడ్ డైరెక్టర్ “చిరంజీవ్ మక్వాన” గురించి నెట్లో తెగ వెతుకుతున్నారు.అయితే చిరంజీవ్ మక్వాన ఆ మధ్య “స్కూబ్” అనే యానిమేటెడ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

 ఈ చిత్రం ఏకంగా యానిమేటెడ్ ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది.అయితే ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు అప్పుడప్పుడు పలు సాంకేతిక లోపాల వల్ల ఇలాంటి తప్పిదాలు జరుగుతాయని అంతమాత్రాన సెలబ్రిటీల గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రష్మిక  మందన తమిళంలో ప్రముఖ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న “పుష్ప” అనే చిత్రంలో కూడా రష్మిక మందన ఓ కీలక పాత్రలో నటిస్తోంది.ఇక అనుపమ పరమేశ్వరన్ విషయానికొస్తే ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో “తల్లి పోగతాయై” అనే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.  ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

#AnupamaBoy #IsRashmika #RashmikaLove

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు