పది పాస్‌ అవ్వడానికి చాలా కష్టపడ్డానంటున్న స్టార్‌ హీరో  

Is Rana Daggubati Failed In 10th Class-baahubali Actor,no 1 Yaari Talk Show,rana Daggubati

ప్రస్తుతం టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రానా తన మనసులో ఉన్న విషయాలను మొహమాటం లేకుండా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటాడు. తాజాగా ఆయన ఒక టాక్‌ షో నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఆ టాక్‌ షోలో రానా ఆసక్తికర అంశాలను వెళ్లడించాడు..

పది పాస్‌ అవ్వడానికి చాలా కష్టపడ్డానంటున్న స్టార్‌ హీరో-Is Rana Daggubati Failed In 10th Class

రానా తనకు పదవ తరగతి పాస్‌ అవ్వడానికి చాలా కష్టం అయ్యిందని, అందుకు నేను చాలా కృషి చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. తన తండ్రి మరియు తాత గారు చాలా ఓర్పుతో నన్ను చదివించారు. వారి కోసం తాను చాలా స్కూల్స్‌ మారి నేను పదవ తరగతి పాస్‌ అయినట్లుగా చెప్పుకొచ్చాడు.

పదవతరగతి పాస్‌ అవ్వడం కోసం నేను పలు స్కూల్స్‌ మారాను. ఆ సమయంలోనే నాకు రామ్‌ చరణ్‌ పరిచయం అయ్యాడు. నేను పదవ తరగతి పాస్‌ అవ్వడానికి చాలా కష్టపడ్డట్లుగా రానా చెప్పడం అందరిని ఆశ్చర్యపర్చుతోంది.

బాహుబలి చిత్రంతో భల్లాలదేవుడిగా స్టార్‌డం దక్కించుకున్న రానా గత కొంత కాలంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు. అయినా కూడా ఆయనకు మంచి ఆధరణ సినీ జనాల్లో మరియు ప్రేక్షకుల్లో ఉందని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఈయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నెం.1 యారి షోలో టాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఈయన మాట్లాడుతూ పై విషయాలను చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం రానా ఒక తమిళ చిత్రంతో పాటు హిందీ చిత్రంతో కలిపి మొత్తంగా నాలుగు సినిమాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.