ఆ సినిమాలతో రామ్ చరణ్ రేంజ్ అలా పెరగనుందట!

టాలీవుడ్ మెగా నటుడు రామ్ చరణ్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.

 Is Ram Charan Carrier Going To Next Level By These Two Films-TeluguStop.com

అంతేకాకుండా ఈ సినిమాలో మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్స్ కాకుండా.

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, మరో ఐరీష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

 Is Ram Charan Carrier Going To Next Level By These Two Films-ఆ సినిమాలతో రామ్ చరణ్ రేంజ్ అలా పెరగనుందట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఆచార్య.

ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా.ఇందులో రామ్ చరణ్ పాత్ర ఒక గంట సేపు ఉండేటట్టు ప్లాన్ చేశారు.

ఇందులో రామ్ చరణ్ సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో నటిస్తున్నాడు.ఇక రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

మార్నింగ్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా మే 13న విడుదల కానుంది.రామ్చరణ్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నందున.

ఆ సినిమాలతో ఆయన రేంజ్ మరింత పెరుగనుందట.

రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా అక్టోబర్ 13న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఫ్యాన్ ఇండియా సినిమా లో చేయనున్నాడట.ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించనున్నాడు.

ఈ సినిమాను సరికొత్త కాన్సెప్ట్ తో తీయాలని నిర్ణయించుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తీయనున్నారు.

అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా చేయనున్నాడు.ఈ సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఉండవని కేవలం పొలిటికల్ ఎంటర్ టైనర్ గా రానుందని తెలుస్తోంది.

మొత్తానికి రాజమౌళి దర్శకత్వంలో, శంకర్ దర్శకత్వంలో దక్షిణాది ఇండస్ట్రీలో రికార్డు సాధించాడని చెప్పాలి.మొత్తానికి ఈ రెండు సినిమాల పట్ల రామ్ చరణ్ రేంజ్ మరింత పెరగనుందని అర్థమవుతుంది.

#Koratala Shiva #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు