త‌లైవా... మోడీ విసిరిన బాణ‌మేనా ?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో ఎవ‌రు మాత్రం ఊహించ‌గ‌ల‌రు.అవకాశం, అవ‌స‌రం అనే రెండు కార‌ణాలే ఎవ‌రినైనా రాజ‌కీయాల్లో న‌డిపిస్తుంటాయి.

 Is Rajinikanth.. A Political Stratagey Of Modi?, Tamilnadu, Sasi Kala, Jaya Lali-TeluguStop.com

ఎవ‌రు ఎవ‌రికీ శాశ్వ‌త శ‌త్రువులు కారు ఎవ‌రు ఎవ‌రికీ శాశ్వ‌త మిత్రులు కూడా కారు.ఎవ‌రైనా రాజ‌కీయాల్లో వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నానికే ప్ర‌ధాన ప్రాధాన్యం ఇస్తారు.

ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే త‌మిళ‌నాడులోనూ చోటు చేసుకుంటోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.త‌మిళ సూప‌ర్ స్టార్ త‌లైవా ర‌జనీకాంత్ రాజ‌కీయ అరంగేట్రం చేయనున్నారు.

దీనికి సంబందించి ఆయ‌న రెండు సంవ‌త్స‌రాలుగా సాగిస్తున్న గుంజాట‌న‌కు ఎట్ట‌కేల‌కు బ్రేక్ వేసి వ‌‌చ్చే నెల‌లో పార్టీ పెట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇంత వ‌ర‌కు ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు.

ఎవ‌రు ఎప్పుడు ఎక్క‌డైనా ఈ ప్ర‌జాస్వామ్య దేశంలో పార్టీ పెట్టు కునే హ‌క్కు ప‌రిపూర్ణంగా ఉంటుంది.కానీ, సున్నిత హృద‌యుడైన ర‌జ‌నీకి రాజ‌కీయాల‌కు స‌రితూగుతుందా? అనేది కీల‌క ప్ర‌శ్న‌.పైగా వ‌చ్చీరాగానే ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న మ‌రింత విస్మ‌యం క‌లిగిస్తోంది.నీతి, నిజాయితీల‌కు ప్ర‌తిరూప‌మైన రాజ‌కీయాలు సృష్టిస్తాన‌ని ఆయ‌న చెబుతున్నారు.ఇది త‌మిళ‌నాడు వంటి ఒక రాజ‌కీయ వైరుధ్యం ఉన్న రాష్ట్రంలో సాధ్య‌మ‌య్యే ప‌నికాద‌ని గ‌తంలో అనేక రుజువులు ఉన్నాయి.

Telugu Jaya Lalitha, Narendra Modi, Rajini Fans, Sasi Kala, Tamilnadu-Political

ఇక్క‌డ ఏ ప్ర‌భుత్వం కొలువుదీరాల‌న్నా ఓట‌రుకు ఉచితాల ప్ర‌క‌ట‌న త‌ప్ప‌దు.ఖ‌జానా నిండుకున్నా ఉచితాలు కొన‌సాగించాల్సిందే.ప్ర‌జ‌ల‌ను ఆవిధంగా మ‌ప్పేసిన రాజకీయ పార్టీలున్న రాష్ట్రంలో నీతి వంత‌మైన రాజ‌కీయాలు చేయ‌డం త‌లైవాకు దుస్సాధ్యం ! ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ర‌జనీ జీవితం వ్య‌క్తిగ‌తం.

ఆయ‌న ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తే ఆయ‌న ప్ర‌జాజీవితాన్ని గ‌డ‌పాలి.వ‌చ్చే ఆటుపోటులను విమ‌ర్శ‌ల‌ను త‌ట్టుకుని నిల‌వాలి.ఇవ‌న్నీ ఆయ‌న‌కు సాధ్య‌మేనా?  అంటే.వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌ను ద‌గ్గ‌ర‌నుంచి చూసిన వారికి సాధ్యం కాద‌నే అనిపిస్తుంది.

మ‌రి దీని వెనుక ఎవ‌రున్నారు ? ర‌జ‌నీని వెనుక నుంచి ఎవ‌రు ప్రోత్స‌హిస్తున్నారు ? అంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచనాల‌ను బ‌ట్టి కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఉంద‌నే అంటున్నారు.ప్ర‌త్య‌క్షంగా , ప‌రోక్షంగా మోడీ.

ర‌జ‌నీ ద్వారా ఇక్క‌డ చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న‌ట్టు గుసగుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.మ‌రి ర‌జనీ లొంగిపోతారా?  లేదా ?  చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube