రాహుల్..! నువ్వు భారతీయుడివేనా ?

కాంగ్రెస్ యువరాజు, ఎన్నికల ఫలితాలు అనుకూలిస్తే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీకి ఇప్పుడు ఓ చిక్కొచ్చి పడింది.అసలు రాహుల్ నువ్వు భారతీయుడివేనా అంటూ కేంద్ర హోమ్ శాఖ నోటీసులు జరీ చేయడం కలకలం రేపుతోంది.

 Is Rahul Gandhi British Citizen-TeluguStop.com

రాహుల్ మీరు భారతీయుడా లేక బ్రిటన్ పౌరుడా అనే విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ కావడంతో కాంగ్రెస్ కూడా ఘాటుగానే స్పందించింది.బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం మంగళవారం రాహుల్‌కు నోటీసు జారీ చేసింది.

పదిహేను రోజుల్లోగా దీనికి సమాధానం చెప్పాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.హోంశాఖ పరిధిలోని విదేశీ పౌరుల విభాగం డైరెక్టర్‌ బీసీ జోషి పేరుతో నోటీసులు జారీ అయ్యాయి.
రాహుల్‌ బ్రిటన్‌లో బ్యాకప్స్‌ లిమిటెడ్‌ అనే కంపెనీలో డైరెక్టర్‌గా, సెక్రటరీగా ఉన్నారని, తన జాతీయతను బ్రిటిష్ గా పేర్కొన్నారని సుబ్రమణ్య స్వామి తన ఫిర్యాదులో పొందుపరిచారు.అయితే సదరు కంపెనీని మూసివేస్తూ సమర్పించిన దరఖాస్తులోనూ తాను బ్రిటిష్‌ పౌరుడినే అంటూ రాహుల్‌ చెప్పుకొచ్చారన్నారు.

ఈ నేపథ్యంలో రాహుల్‌ పౌరసత్వంపై విచారణ చేపట్టాలంటూ కేంద్ర హోంశాఖను సుబ్రమణ్య స్వామి కోరారు.అసలు ఈ వివాదం ఇప్పుడు మొదలయ్యింది కాదు.దీనిపై ఎంఎల్‌ శర్మ అనే సీనియర్‌ న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.రాహుల్‌ పౌరసత్వంపై సీబీఐ విచారణ జరిపించాలని అందులో కోరారు.

అయితే సుపరిపాలన, సామాజిక ఇబ్బందులపైనే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.వ్యక్తులను టార్గెట్ చేసుకుని దాఖలు చేసే వ్యాజ్యాలను విచారణకు తాము స్వీకరించలేమని 2015 నవంబరులో అప్పటి ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్‌ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

పిటిషన్‌తో పాటు జత చేసిన డాక్యుమెంట్ల విశ్వసనీయతను కూడా ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది.ఇదే అంశంపై సుబ్రమణ్యస్వామి 2016లో లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.‘నేను బ్రిటిష్‌ పౌరుడిని’ అని రాహుల్‌ స్వయంగా పేర్కొన్న పత్రాలు తన వద్ద ఉన్నాయని అందులో తెలిపారు.దీనిని అధ్వాని నేతృత్వంలోని ఎథిక్స్‌ కమిటీ పరిశీలనకు స్పీకర్‌ పంపించారు.

దీనిపై కమిటీ రాహుల్‌ వివరణ కోరగా ‘నేను ఎప్పుడూ బ్రిటిష్‌ పౌరసత్వం తీసుకోలేదు.నేను భారతీయుడిని.

కేవలం నాపై బురదజల్లేందుకే ఈ ఫిర్యాదు చేశారు.అంటూ రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరోసారి ఈ వివాదం తెర మీదకు రావడంతో రాజకీయ రచ్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube