ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సెన్సేషన్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారింది.సుకుమార్ టేకింగ్.
బన్నీ పర్ఫార్మెన్స్ పుష్ప సినిమాని నెక్స్ట్ లెవల్ లో నిలబెట్టాయి.పుష్ప సినిమా పార్ట్ 1 అదిరిపోయే రిజల్ట్ అందించింది.
ముఖ్యంగా పుష్ప పార్ట్ 1 ది రైజ్ ని హిందీ ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు.అక్కడ స్టార్స్ సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అన్న సంసిగ్దము లో ఉంటే తెలుగు హీరో అల్లు అర్జున్ బాలీవుడ్ బాక్సాఫీస్ మీద 85 కోట్లని కలెక్ట్ చేశాడు.
ఇది మాములు విషయం కాదు అద్భుతమని చెప్పొచ్చు.
ఇక పుష్ప పార్ట్ 1 ఈ రేంజ్ లో హిట్ అయ్యింది కాబట్టి పార్ట్ 2 పై అంచనాలు పెరిగాయి.
పార్ట్ 2 అంతకుమించి అనిపించేలా చేస్తున్నారని తెలుస్తుంది.అయితే పుష్ప పార్ట్ 2 రిలీజ్ టైం లో ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం ఓటీటీ రిలీజ్ చేసేలా కూడా ప్లాన్ చేస్తున్నారట.
ఓ పక్క హిందీ రైట్స్ కొన్న గోల్డ్ మైన్స్ టెలి ఫిల్మ్ వారు పుష్ప 2 బాహుబలి 2 రికార్డులను కొల్లగొడుతుందని అంటున్నారు.ఏది ఏమైనా పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఓ తెలుగు సినిమా స్టామినా ఏంటన్నది మరోసారి చూపించింది.
అయితే పుష్ప పార్ట్ 2 ఓటీటీలో వచ్చే ఛాన్సులు చాలా తక్కువ.కోట్లు కొల్లగొట్టే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు.