తెలుగులో ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రముఖ టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే… అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిపారు.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించేందుకు “మలయాళ నటి ప్రయాగ మార్టిన్” అనే హీరోయిన్ ని ఎంపిక చేశారు. కానీ ఈ చిత్రంలో ఈ అమ్మడు నటించేటువంటి పాత్రకి సూటవ్వకపోవడంతో ఆమెను ఈ చిత్రం నుంచి తొలగించినట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
అయితే ఈ చిత్రంలో ప్రయాగ మార్టిన్ ఓ పవర్ ఫుల్ “ఐఏఎస్ ఆఫీసర్” పాత్రలో నటించబోతుందని గతంలో పలు వార్తలు వినిపించాయి.
అయితే ఈ చిత్రం నుంచి ప్రయాగ మార్టిన్ ని తొలగించినట్లు వస్తున్నటువంటి వార్తలపై ఇప్పటివరకు ఇటు చిత్ర యూనిట్ సభ్యులు గానీ లేదా ప్రయాగ మార్టిన్ గానీ స్పందించడం లేదు.
దీంతో ఆమెను ఈ చిత్రం నుంచి తొలగించినట్లు వస్తున్నటువంటి వార్తలో నిజమెంత ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది.కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అంజలిని చిత్ర యూనిట్ సభ్యులు సంప్రదించినప్పటికీ ఆమె పలు కారణాల వల్ల నో చెప్పినట్లు సమాచారం.