జగన్ కు పీకే ఆ విషయం చెప్పాడా లేదా ?  

Is Prashant Kishor Give Ycp Report To The Ys Jagan-chandrababu Naidu,pk,prashant Kishor,tdp,who Is Next Cm Of Andhra Pradesh,ycp,ys Jagan

వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ముందు ఆ పార్టీకి కలిసొచ్చేలా అనేక వ్యూహాలు రూపొందించాడు. ఎన్నో ప్లాన్లు వేశాడు. ఆ వ్యూహాలతో వైసీపీ బాగా పుంజుకుంది..

జగన్ కు పీకే ఆ విషయం చెప్పాడా లేదా ? -Is Prashant Kishor Give YCP Report To The YS Jagan

పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కూడా వైసీపీ గతం కంటే ఇప్పుడు బాగా మెరుగయ్యింది. ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉండబోతున్నట్టే అనేక సర్వేలు తేల్చేశాయి. ఈ క్రెడిట్ అంతా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కే దక్కుతుంది.

ఎందుకంటే ఎన్నికల సమయంలో నియోజక వర్గాల వారీగా, ఇంకా చెప్పాలంటే మండలాల వారీగా నివేదికలు ఇస్తూ, ఎక్కడైతే పార్టీ వెనుకబడిందో అక్కడ ప్రత్యేక దృష్టి సారించి అక్కడ పార్టీ బలోపేతం అయ్యేలా పీకే నివేదికలు ఇచ్చారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత. కాబోయే సీఎం జగన్ చెప్పేసి, ప్రశాంత్ కిషోర్ అండ్ టీమ్ బీహార్ వెళ్లిపోయారు.

ఏపీలో జగన్ అధికారంలోకి రాబోతున్నారనీ మెజార్టీ ఎంపీ స్థానాలను కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకోబోతోందని అనేక ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. కాకపోతే వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ ఈ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి జగన్ కు ఏమైనా చెప్పారా ? పోల్ మేనేజ్మెంట్ చేసిన ఆయన, ఫలితాలపై ఏదో ఒక నివేదికను జగన్ కు అందజేయకుండా ఉంటారా అనే సందిగ్దత ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.జగన్ కు ఫలితాలకు సంబంధించి పీకే ఏదైనా నివేదిక ఇచ్చి ఉంటే అది ఏమై ఉంటుంది అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.

పీకే ఏం చెప్పారో జగన్ కూడా బయటపెడితే, వైసీపీ కార్యకర్తలకు మరింత ఉత్సాహం పెరుగుతుంది. జాతీయ మీడియా అంచనాలు ఎలా ఉన్నాకానీ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన గ్రౌండ్ రిపోర్టుపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది కదా ! అసలు వైసీపీ ఎన్నికల ఫలితాలపై పీకే అంచనా వేశారా లేదా అనే అనుమానం కూడా అందరిలోనూ వ్యక్తమౌతోంది.

అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులను చాలా పర్ఫెక్ట్ గా అంచనా వేసిన పీకే ఈ ఎగ్జిట్ పోల్స్ మీద తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేస్తే ఏ గందరగోళం ఉండకపోదును కానీ ఈ విషయంలో జగన్ కానీ పీకే కానీ నోరుమెదపకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది.