జగన్ కు పీకే ఆ విషయం చెప్పాడా లేదా ?

వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ముందు ఆ పార్టీకి కలిసొచ్చేలా అనేక వ్యూహాలు రూపొందించాడు.ఎన్నో ప్లాన్లు వేశాడు.

 Is Prashant Kishor Give Ycp Report To The Ys Jagan-TeluguStop.com

ఆ వ్యూహాలతో వైసీపీ బాగా పుంజుకుంది.పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కూడా వైసీపీ గతం కంటే ఇప్పుడు బాగా మెరుగయ్యింది.

ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉండబోతున్నట్టే అనేక సర్వేలు తేల్చేశాయి.ఈ క్రెడిట్ అంతా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కే దక్కుతుంది.

ఎందుకంటే ఎన్నికల సమయంలో నియోజక వర్గాల వారీగా, ఇంకా చెప్పాలంటే మండలాల వారీగా నివేదికలు ఇస్తూ, ఎక్కడైతే పార్టీ వెనుకబడిందో అక్కడ ప్రత్యేక దృష్టి సారించి అక్కడ పార్టీ బలోపేతం అయ్యేలా పీకే నివేదికలు ఇచ్చారు.ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత.

కాబోయే సీఎం జగన్ చెప్పేసి, ప్రశాంత్ కిషోర్ అండ్ టీమ్ బీహార్ వెళ్లిపోయారు.

-Telugu Political News

ఏపీలో జగన్ అధికారంలోకి రాబోతున్నారనీ మెజార్టీ ఎంపీ స్థానాలను కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకోబోతోందని అనేక ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.కాకపోతే వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ ఈ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి జగన్ కు ఏమైనా చెప్పారా ? పోల్ మేనేజ్మెంట్ చేసిన ఆయన, ఫలితాలపై ఏదో ఒక నివేదికను జగన్ కు అందజేయకుండా ఉంటారా అనే సందిగ్దత ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.జగన్ కు ఫలితాలకు సంబంధించి పీకే ఏదైనా నివేదిక ఇచ్చి ఉంటే అది ఏమై ఉంటుంది అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.

-Telugu Political News

పీకే ఏం చెప్పారో జగన్ కూడా బయటపెడితే, వైసీపీ కార్యకర్తలకు మరింత ఉత్సాహం పెరుగుతుంది.జాతీయ మీడియా అంచనాలు ఎలా ఉన్నాకానీ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన గ్రౌండ్ రిపోర్టుపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది కదా ! అసలు వైసీపీ ఎన్నికల ఫలితాలపై పీకే అంచనా వేశారా లేదా అనే అనుమానం కూడా అందరిలోనూ వ్యక్తమౌతోంది.అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులను చాలా పర్ఫెక్ట్ గా అంచనా వేసిన పీకే ఈ ఎగ్జిట్ పోల్స్ మీద తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేస్తే ఏ గందరగోళం ఉండకపోదును కానీ ఈ విషయంలో జగన్ కానీ పీకే కానీ నోరుమెదపకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube