ప్రదీప్ సినిమాను ఓటిటి లో విడుదల చెయ్యడమే మంచిదా..?

తెలుగులో ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు  “30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా మలయాళ బ్యూటీ “అమృత అయ్యర్” నటిస్తుండగా  నూతన దర్శకుడు “మున్నా” దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత బాబు ఎస్.వి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి అయినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో చిత్రం విడుదలను కొంత కాలంపాటు తాత్కాలికంగా నిలిపి వేశారు.

 Is Pradeep Machiraju Movie 30 Rojullo Preminchadam Ela Movie Release In Aha Plat-TeluguStop.com

ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితులను బట్టి చూస్తుంటే మరింత కాలం పాటు సినిమా థియేటర్లు మూత పడటం ఖాయంగా కనిపిస్తోంది.దీనికి తోడు మళ్లీ కరోనా సెకండ్ వేవ్ వస్తోందని మరిన్ని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

దీంతో ఈ చిత్రాన్ని దర్శక నిర్మాతలు ఓటిటి  ప్లాట్ ఫారం లో విడుదల చేస్తే మంచిదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక ఇటీవలే ప్రముఖ షార్ట్ ఫిలిం దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన “కలర్ ఫోటో” చిత్రాన్ని తెలుగు ప్రముఖ  ఓటిటి  ప్లాట్ ఫారం ఆహాలో విడుదల చేయగా మంచి ఫలితాలను సాధించారు.

Telugu Aha Aha Platm, Amritha Aiyer, Ott Aha Platm, Tollywood-Movie

అంతేగాక  ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద చిత్రాల విడదల కూడా లేకపోవడంతో మరింత కలిసొచ్చే అంశమని  మరికొందరు అంటున్నారు. ఒకవేళ సినిమా థియేటర్లు తెరిచినప్పటికీ ఇప్పటికే కొందరు బడా సినీ నిర్మాతలు తమ చిత్రాల విడుదల కోసం  కాచుకొని ఉన్నారని కాబట్టి ఫలితం ఏమాత్రం తారుమారైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube