'రామాయణం'లో ప్రభాస్‌ నిజమేనా?  

Is Prabhas True In The Ramayana?-hrithik Roshan,prabhas,prabhas Role In Ravan

మెగా నిర్మాత అల్లు అరవింద్‌ ఇంకా బాలీవుడ్‌ ప్రముఖులు భారీ బడ్జెట్‌తో ‘రామాయణం’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.దిగ్గర దర్శకులు ఇద్దరు ఈ చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నారు.మూడు లేదా నాలుగు భాగాలుగా ఈ చిత్రంను రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు.2020లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.ఇక ఈ చిత్రంలో రాముడి పాత్రకు గాను హృతిక్‌ రోషన్‌తో చర్చలు జరుగుతున్నాయి.సీత పాత్రకు దీపిక పదుకునే నటించే అవకాశం ఉంది.

Is Prabhas True In The Ramayana?-hrithik Roshan,prabhas,prabhas Role In Ravan-Is Prabhas True In The Ramayana?-Hrithik Roshan Prabhas Role Ravan

Is Prabhas True In The Ramayana?-hrithik Roshan,prabhas,prabhas Role In Ravan-Is Prabhas True In The Ramayana?-Hrithik Roshan Prabhas Role Ravan

కేవలం బాలీవుడ్‌ నటీనటులు మాత్రమే కాకుండా అన్ని భాషలకు సంబంధించిన ముఖ్య నటీనటులను ఈ చిత్రంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు.అందుకే కీలకమైన రావణుడి పాత్రకు గాను మన తెలుగు స్టార్‌ ప్రభాస్‌ను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది.

ఇప్పటికే ప్రభాస్‌తో చర్చలు జరిపినట్లుగా సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.బాహుబలి చిత్రం తర్వాత సాహో చిత్రంతో ప్రభాస్‌ తన స్థాయిని నిరూపించుకున్నాడు.అందుకే ప్రభాస్‌ ఖచ్చితంగా రామాయణంకు హైలైట్‌ అవుతాడని మేకర్స్‌ భావిస్తున్నారు.

బాహుబలి చిత్రం కోసం దాదాపుగా నాలుగు ఏళ్లు సమయం కేటాయించిన ప్రభాస్‌ ఇకపై ఎక్కువ టైం ఒకే సినిమాకు కేటాయించవద్దని నిర్ణయించుకున్నాడు.అందుకే ఈ భారీ ప్రాజెక్ట్‌కు ప్రభాస్‌ ఓకే చెప్పడం అనుమానమే అనిపిస్తుంది.అయితే లీడ్‌ రోల్‌ కాదు రావణ పాత్ర కనుక ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు, ఇతర ప్రాజెక్ట్‌లు చేసుకోవచ్చు అంటే అప్పుడు ప్రభాస్‌ ఆలోచిస్తాడేమో చూడాలి.ఇప్పటి వరకు ఎంతో మంది పేర్లు ఈ సినిమా కోసం వినిపించాయి.మరి ఎవరు ఫైనల్‌ అయ్యేనో చూడాలి.