జనసేనకు ప్రభాస్ మద్దతు పలకబోతున్నాడా ..? కారణం ఇదేనా ..?     2018-10-19   06:30:41  IST  Sai Mallula

సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాల్లో తానేంటో నిరూపించుకునేందుకు ఇప్పటికే రంగంలోకి దిగిపోయాడు. మెల్లిగా రాజకీయ అడుగులు వేస్తున్నా… ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలను భయపెట్టే స్థాయిలో పవన్ తన బలం పెంచుకున్నాడు. ముఖ్యంగా గోదావరి జిల్లాలపై ఎక్కువ దృష్టిపెట్టిన పవన్ అక్కడ మెజార్టీ సీట్లు దక్కించుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. గత కొన్ని రోజుల నుండి టీడీపీ చేస్తున్న అక్రమాలపై టీడీపీ నేతలని విమర్శిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా ఎదిగాడు . ప్రస్తుత ప్రజాపోరాట యాత్ర అంటూ రాష్ట్రము లో సభలు పెడుతూ రాజకీయ వేడిని పెంచుతున్నాడు .

Is Prabhas Supporting Janasena Pawan Kalyan-

Is Prabhas Supporting Janasena Pawan Kalyan

జనసేనకు జనల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లభిస్తుండడంతో.. రెబల్ స్టార్ కృష్ణం రాజు బీజేపీ ని విడి జనసేన లో చేరాడు. పవన్ సొంత ఊరికి చెందిన కృష్ణం రాజు ఆ పార్టీ నుంచి నరసాపురం పార్లమెంట్ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ దశలో ఆయనకు మద్దతుగా హీరో ప్రభాస్ కూడా జనసేనకు జై కొట్టేందుకు సిద్ధం అవుతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి.

Is Prabhas Supporting Janasena Pawan Kalyan-

ఎలాగూ తన పెదనాన్న ఉన్నాడు కాబట్టి జనసేన కి మద్దతు ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. దీనికి తోడు క్షత్రియ సామాజికవరగానికి చెందిన వీరు జనసేన కు జై కొడితే గోదావరి జిల్లాలో ప్రధాన సామాజికవర్గంగా ఉన్న ఆ సామజిక వర్గ ఓట్లు జనసేన ఖాతలో పడతాయని అంతే కాకుండా ప్రభాస్ కనుక ప్రచారానికి వస్తే జనసేన కి మరింత ఊపు వస్తుంది అని పవన్ కూడా ఉత్సాహం చుపిస్తున్నాడట. కాకపోతే కృష్ణం రాజుకి సీటు కన్ఫర్మ్ అయితే అప్పుడు ఈ మద్దతుపై ప్రకటన చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్టు తెలుస్తోంది.