రాధే శ్యామ్ మరోసారి వాయిదా పడబోతుందా !

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.ఈ సినిమా తర్వాత వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

 Is Prabhas Radhe Shyam Movie Postponed Once Again, Prabhas, Radhe Shyam, Postpon-TeluguStop.com

ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమాను యువీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.

ఎప్పుడో రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా జులై 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.అయితే ఇప్పుడు మరొక గాసిప్ మొదలయ్యింది.ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యింది.మహారాష్ట్రలో మరింత విజృంభిస్తుంది.

అందువల్ల మరొక సారి ఈ సినిమా వాయిదా పడబోతుందని వార్తలు వస్తున్నాయి.

Telugu Corona Effect, Corona Wave, Radha Krishna, Mumbai, Pooja Hegde, Prabhas,

ముంబైలో కూడా కరోనా ఎక్కువుగా ఉండడం వల్ల అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి ఆటంకాలు ఎదురవుతున్నట్టు తెలుస్తుంది.సినిమా అనంతరం కీలకమైన వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి చేయాల్సి ఉండగా దానికి అడ్డుగా కరోనా మారిందని ఇప్పుడు ఆ పనులను హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాల్సి ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

ఇది జరగడానికి టైం పడుతుంది కాబట్టి అనుకున్న టైం కి పనులు పూర్తి కావు.

అందువల్ల రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది.ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం స్పష్టం అవ్వదు.

ఇది ఇలా ఉండగా ప్రభాస్ ఈ సినిమాతో పాటుగా సలార్, ఆది పురుష్ సినిమాలు కూడా అనౌన్స్ చేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేసాడు.ఈ రెండు సినిమాలను ఒకేసారి షూటింగ్ పూర్తి చేస్తూ ప్రభాస్ బిజీగా ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube