Pawan Kalyan Lokesh: లోకేష్ పాదయాత్ర.. బస్సు యాత్రను రద్దు చేసుకున్న పవన్?

సాధరణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఎపీలోని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి.ఇందులో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  రాజకీయంగా రాష్ట్రమంతా పర్యటించాలని ప్రణాళికను రూపోందించారు.

 Is Pawan Kalyans Bus Chariot A Mere Waste Details, Pawan Kalyan, Pawan Kalyan Bu-TeluguStop.com

డిసెంబర్‌లో బస్సు యాత్రకు చేయాలని నిర్ణయించుకున్నారు.దాని కోసం స్పెషల్‌గా ఓ బస్సును కూడా తయారుచేయించారు.

 ఈ రథం సైనిక వాహనం, ఎన్టీఆర్ పాత చైతన్యరథాన్ని పోలి ఉంటుంది.ఈ వాహనం ఆగస్టులోనే రూసొందినప్పటికీ  ఇంతవరకు దీన్ని ఉపయోగించలేదు.

పవన్ బస్సు యాత్ర 2022 దసరా నుండి ఉంటుందని మొదట్లో  వార్తలు వచ్చాయి.కానీ నెలలు గడిచిన యాత్ర ప్రారంభం కాలే.

ఇప్పుడు సంక్రాంతి సీజన్ కూడా రాబోతోంది.ఈ విషయంపై జనపార్టీ వర్గాల నుండి డిఫరెంట్ వాదన వినిపిస్తుంది.

నిజానికి పవన్ తన యాత్రను దసరాకే ప్లాన్ చేసుకున్నప్పటికీ, అయితే ఆ సమయంలో అమరావతి రైతుల యాత్ర కొనసాగుతుండడం కారణంగా  వారి యాత్రకు ఇబ్బంది కలుగుతుందని భావించి వెనక్కి తగ్గారని వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు అమరావతి రైతులు యాత్రకు స్వస్తి పలకడంతో  ఇప్పుడు లోకేష్ స్వయంగా 400 రోజుల యాత్రలోకి దిగుతున్నారు.

 టీడీపీ, జనసేన మధ్య కుదిరిన అవగాహన ప్రకారం లోకేష్ యాక్టీవ్‌గా ఉంటే పవన్ గ్రౌండ్‌లో ఉండడు.

Telugu Ap, Janasena, Lokesh, Pawan Kalyan, Pawankalyan, Tdpjanasena-Political

2023 ఎన్నికల వరకు లోకేశ్ యాత్ర కొనసాగుతుంది కాబట్టి, పవన్‌కు యాత్ర చేయాల్సిన అవసరం లేదు.దీంతో ఆయన  రథం పార్కింగ్ ప్లేస్‌లో ఉండాల్సిదే.  ఇప్పుడు పవన్ చేయగలిగిందల్లా సాధరణ ఎన్నికల ప్రచారమే.

లేకపోతే  ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న మూడు సినిమాలకు పూర్తి సమయం కేటాయించడం.దీనిపై వైసీపీ నాయకులు ఘాలుగా స్పందిస్తున్నారు.

 పవన్ పార్ట్ టైం రాజకీయ నాయకుడని యాత్రలు చేయడంపై అతని ఆసక్తి ఉండవని విమర్శిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube