ఇంతకు 'పింక్‌' కు 'వకీల్‌ సాబ్‌' కు సంబంధం ఉందా? లేదా?

బాలీవుడ్‌ లో సూపర్ హిట్‌ అయిన మూవీ పింక్.అమితాబచ్చన్ నటించిన పింక్ పూర్తిగా ఒక మెసేజ్ ఓరియంటెడ్‌ లేడీ ఓరియంటెడ్‌ మూవీ.

 Is Pawan Kalyan Vakeel Saab Movie Remake Of Pink Movie Or Not , Vakeel Saab, Pin-TeluguStop.com

ఆడవారి సమస్యల మీద తీసిన పింక్ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.పింక్‌ ను ఉన్నది ఉన్నట్లుగా తమిళంలో అజిత్ చేశాడు.

ఆయన కమర్షియల్‌ హీరో అవ్వడం వల్ల పింక్ సినిమా ను ఆయన అభిమానులు కాస్త దూరం పెట్టారు.ఇప్పుడు పింక్ ను తెలుగు లో పవన్ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ టైటిల్‌ తో తీసుకు రాబోతున్నాడు.

టైటిల్ ను బట్టే అర్థం అవుతుంది ఈ సినిమా లో ఎన్ని మార్పులు ఎన్నెన్నో మార్పులు చేసి ఉంటారని.ఆ రెండు సినిమా ల టైటిల్స్ ఆడవారికి రిలేటెడ్‌ గా ఉంటే వకీల్ సాబ్‌ మాత్రం పవన్ కళ్యాణ్ పాత్రకు అనుబంధంగా ఉంది.

ఇక పింక్‌ లో ఎంతో కీలకమైన కోర్టు సీన్ లను కూడా వకీల్‌ సాబ్‌ లో మార్చేశారు.అమితాబ్‌ బచ్చన్ అమ్మాయిని నువ్వు వర్జినా అని అడుగుతాడు.

కాని పవన్‌ ఎవరిని అడిగాడో మనం ట్రైలర్‌ చూస్తే తెలుసుకోవచ్చు.

కోర్టు సీన్‌ ను కూడా సరదాగా చేసినట్లుగా పవన్ బాడీ లాంగ్వేజ్‌ మరియు ప్రకాష్‌ రాజ్ హావభావాలను చూస్తుంటే అనిపిస్తుంది.

సినిమాకు ఆయువు అయిన కోర్టు సీన్‌ లనే మార్చేస్తే ఇది పింక్ కు రీమేక్ ఎలా అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.పైగా వకీల్‌ సాబ్‌ లో ఫ్ల్యాష్ బ్యాక్‌ సన్నివేశాలను ప్రత్యేకంగా యాడ్‌ చేస్తున్నారు.

అంటే కమర్షియల్‌ గా మరో లెవల్‌ కు తీసుకు వెళ్తున్నారు.ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే సినిమా లో మొత్తంకు మొత్తం సీన్స్ ను కొత్తగా చెప్పే చూపించే ప్రయత్నం చేశారేమో అనిపిస్తుంది.

పింక్‌ రీమేక్ కు వకీల్‌ సాబ్‌ కు అసలు సంబంధం ఉందా లేదా అనే అనుమానాలను పింక్ చూసిన వారు వ్యక్తం చేస్తున్నారు.తాజాగా అంజలి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను డబ్బింగ్‌ చెబుతున్న సమయంలో కథను చాలా మార్చారు.

కాని కథలోని ఆత్మ మాత్రం అలాగే ఉందని చెప్పడంను బట్టే ఈ సినిమా లో ఎంతగా మార్పులు చేర్పులు చేశారో అర్థం చేసుకోవచ్చు.ఈ మార్పులు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube