ప్రకాష్ రాజ్ చెప్పింది అబద్ధమేనా..? ఎన్టీఆర్ పవన్ ని హగ్ చేసుకోలేదంట... 

తెలుగులో దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే చిత్రంలో హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించగా ఈ నెల 9వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా విడుదల చేశారు.

 =is Pawan Kalyan And Ntr Hug Is Fake Or Real,  Pawan Kalyan, Ntr, Jr Ntr, Tollyw-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను అందుకుంది.కాగా ఈ చిత్రంలో శృతిహాసన్, అంజలి, నివేద థామస్, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

కాగా ఇటీవలే వకీల్ సాబ్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రంలో లాయర్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారాయి.

అయితే ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ వకీల్ సాబ్ చిత్రాన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ని హత్తుకున్నాడని పలు వ్యాఖ్యలు చేశాడు.

దీంతో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ టీమ్ సభ్యులు ఈ విషయంపై స్పందిస్తూ అసలు ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ని హగ్ చేసుకోలేదని స్పష్టం చేస్తున్నారు.అంతేకాకుండా వకీల్ సాబ్ చిత్రం విడుదలైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా కరోనా పాజిటివ్ కారణంగా హోమ్ క్వారెంటైన్ లో ఉంటున్నాడని అలాంటప్పుడు ఎన్టీఆర్ ని ఎలా కలుస్తాడని మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనికితోడు ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ని కలిసినట్లు వీడియోగానీ ఫోటోలు కానీ లేకపోవడంతో కొందరు అభిమానులు నిజమేనంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రాన్ని విడుదల చేసిన రోజున కలెక్షన్ల పరంగా రికార్డులు నమోదు చేసినప్పటికీ రాను రాను వసూళ్లు దారుణంగా పడిపోయాయి.

దీనికితోడు టికెట్ ధరలు కూడా పెంచకపోవడంతో కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చినట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటి వరకు ఈ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం అధికారికంగా ఈ చిత్ర మొదటివారం వసూళ్ల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube