కేంద్ర పెద్దలను ఒప్పించడంలో జనసేనాని ఫెయిల్ అయ్యారా?

రెండు రోజులు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జనసేనాని రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊహగానాలకు కారణమయ్యారు.రాష్ట్ర రాజకీయాలపై ఒక స్పష్టత తీసుకురావడానికి తెలుగుదేశం- జనసేన- బిజెపి పొత్తు కుదరడానికి అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికే ఆయన ఢిల్లీ వెళ్లారని తెలుగుదేశం అనుకూల చానళ్లు వార్తలు ప్రసారం చేయగా , కేవలం కర్ణాటక ఎన్నికలలో( Karnataka Elections ) ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ ని( Pawan Kalyan ) ఒప్పించడం కోసమే ఢిల్లీకి పిలిపించారని అంతకుమించి ఏమీ లేదని వైసీపీ అనుకూల చానల్లో ప్రచారం చేశారు… హోం మంత్రి అమిత్ షా తోను, ప్రధానమంత్రి మోడీతో కూడా అపాయింట్మెంట్ ఉందని, చర్చలు జరుపుతారని వార్తలు వచ్చినా అవేమి నెరవేరలేదు .

 Is Pavan Kalyan Accept Bjp Request Details, Pawan Kalyan, Janasena Party, Bjp ,-TeluguStop.com

Telugu Amith Sha, Cmjagan, Janasena, Janasenatdp, Jp Nadda, Pawan Delhi, Pawan K

జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర షేకావత్, రాష్ట్ర బిజెపి వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్, జాతీయ బిజెపి అధ్యక్షుడు జేపి నడ్డా తో మాత్రమే సమావేశమైన పవన్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సవివరంగా బిజెపి అధ్యక్షుడికి వివరించారని వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను నిరోధించాలంటే వైసీపీని గద్దె దింపాల్సిన అవసరం ఉందని, దానికి కలసి కట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరాన్ని కేంద్ర బిజెపి పెద్దలకు అర్థమయ్యేటట్టుగా ఆయన చెప్పారని జనసేన శ్రేణులు అంటున్నాయి.అయితే జగన్ ( Jagan ) విషయంలో ఇప్పటికిప్పుడే తొందరపడి ఉద్దేశంలో లేని భాజపా అధినాయకత్వం( BJP ) పవన్కు సర్దుచెప్పి పంపించారని ముందు పార్టీ ఎదుగదల మీద దృష్టి పడితే మంచిదని, పొత్తుల విషయంలో ఎన్నికలకు దగ్గర్లో చూసుకుందామని,

Telugu Amith Sha, Cmjagan, Janasena, Janasenatdp, Jp Nadda, Pawan Delhi, Pawan K

అలాగే కర్ణాటక ఎన్నికలలో ప్రచారం విషయం లో కొంత సహాయం కూడా చేయాలని భాజపా అధ్యక్షుడు పవన్ ను కోరినట్లు తెలుస్తుంది… మరి తాను కోరుకున్న స్తాయిలో ప్రతిస్పందన భాజపా నుంచి రాలేదని జనసేన అధ్యక్షుడు అసంతృప్తికి గురయ్యారని అందుకే ఆయన ఆ తర్వాత పెట్టిన ప్రెస్మీట్లో స్పష్టత లోపించిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.పొత్తుల విషయంలో భాజపా అధినాయకత్వాన్ని ఒప్పించలేకపోయిన పవన్ కళ్యాణ్ తన ప్రచారం కోసం అభ్యర్థించిన భాజపా అభ్యర్థనను మన్నిస్తారా? కర్ణాటక ఎన్నికలలో ప్రచారానికి వెళ్తారా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube