రేసు నుంచి తప్పుకున్న నిఖిల్.. కార్తికేయ 2 వాయిదా..!

యువ హీరో నిఖిల్ ప్రస్తుతం కెరియర్ లో వెనకపడి ఉన్నాడని చెప్పొచ్చు.అతను చేస్తున్న సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వడం లేదు.

 Is Nikhil Karthikeya 2 Release Postpone Nikhil , Karthikeya 2, Postpone , 18 Pag-TeluguStop.com

ఈ క్రమంలో నిఖిల్ రెండు భారీ సినిమాలు చేస్తున్నాడు.ఆ రెండిటితో తిరిగి మళ్లీ ఫాం లోకి రావాలని చూస్తున్నాడు.

నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న సినిమా కార్తికేయ 2.సూపర్ హిట్ మూవీ కార్తికేయ కు సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

ద్వారక బ్యాక్ డ్రాప్ లో ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు.ఈమధ్య రిలీజైన టీజర్ తో కార్తికేయ 2 సినిమాపై అంచనాలు పెంచారు.

జూలై 22న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా అనుకున్న డేట్ కి రావడం కష్టమని అంటున్నారు.సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాని కారణంగా నిఖిల్ కార్తికేయ 2 జూలై 22న రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే చిత్రయూనిట్ ఈ విషయాన్ని ఇంకా డిక్లేర్ చేయలేదు.

Telugu Chandu Mondeti, Karthikeya, Nikhil, Tollywood-Movie

కార్తికేయ 2 సినిమా విషయంలో ఇప్పటివరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు.జూలై 22న రిలీజ్ అంటే రెండు వారాల నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.అదీగాక జూలై 22న నాగ చైతన్య థ్యాంక్ యు సినిమా కూడా రిలీజ్ అవుతుంది.

మరి ఆ సినిమాతో పోటీ అనుకున్నారో ఏమో కానీ జూలై 22న కార్తికేయ 2 రావడం కష్టమే అని అంటున్నారు.జూలై 22 మిస్సైతే నిఖిల్ కార్తికేయ 2కి ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి.

ఈ సినిమాతో పాటుగా నిఖిల్ 18 పేజెస్ అనే లవ్ స్టోరీ చేస్తున్నాడు.ఆ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న 18 పేజెస్ సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube