పవన్ పాదయాత్ర చేయాల్సిందేనా ?

ఏపీలో ఇప్పుడు రాజకీయ సానుభూతి ‘పవనాలు’ వీస్తున్నాయి.ఓడిపోయిన అన్ని పార్టీల మీద సాధారణంగా ప్రజల్లో అంతో ఇంతో సానుభూతి ఉండడం సహజం.

 Is Necessary Padayatra To Pawan Kalyan-TeluguStop.com

అయితే కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జనసేన ఈ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను కేవలం ఒక్కటంటే ఒక్క స్థానానికే పరిమితం కావడంతో అయ్యో అంటూ పవన్ మీద జాలి పడుతున్నారు.ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చెందడం ఆ పార్టీ నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ సార్వత్రిక తంతు అయిందేదో అయిపోయిందిలే ఇక ఆ తరువాత జనసేన స్టెప్ ఏంటి అనే విషయంలో క్లారిటీ దొరకడంలేదు.ఎన్నికల సమరం అప్పుడే ముగిసిపోలేదు.

-Telugu Political News

వైసీపీ కొత్త ప్రభుత్వం మరో మూడు రోజుల్లో కొలువుతీరనుంది.ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగు ఉండనున్నాయి.అప్పుడు జనసేన పోటీలో ఉంటుందా లేదా అనే విషయం లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.కొంతమంది మాత్రం పవన్రా రాజకీయాలకు క్రమ క్రమంగా దూరం అయ్యి సినిమాల్లో బిజీ అవుతాడని భావిస్తున్నారు.

కానీ పవన్ సన్నిహితులు మాత్రం ఆయన రాజకీయాల్లోనే కొనసాగుతారని చెబుతున్నారు.ప్రభుత్వం తనపని తాను సక్రమంగా నిర్వర్తించేలా పవన్ ప్రశ్నిస్తూనే ఉంటారని అంటున్నారు.కానీ పవన్ మాటలకు ప్రస్తుతం చేస్తున్న పనులకు పొంతన కనిపించడం లేదు.ప్రస్థులంతానికి అయితే పవన్ అజ్ఞాతంలో ఉన్నారు.

ఎప్పుడు బయటకి వస్తారో కూడా ఎవరికీ క్లారిటీ లేదు.

రానున్న ఈ ఐదేళ్లల్లో పవన్ పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారు అనేది తేలాల్సి ఉంది.

వచ్చే ఎన్నికల నాటికి జనసేన పుంజుకోవాలంటే పవన్ ధైర్యంగా ఏదో ఒక స్టెప్ వేయాల్సిందే.అంటే వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు జగన్ ఏ విధంగా నిత్యం ప్రజల్లో తిరిగాడో అదే విధంగా పవన్ కూడా జనాల్లో మమేకం అయితేనే జనసేనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేది రాజకీయ పండితుల వాదన.

ఈ సందర్భంగా పాదయాత్ర అంశం కూడా తెరమీదకు వస్తోంది.వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పాదయాత్ర ద్వారానే అధికారంలో వచ్చాడు.

-Telugu Political News

ఆ తరువాత దాన్ని కాపీ కొట్టి చంద్రబాబు కూడా ఫాలో అయ్యాడు.ఇక ఆ తరువాత మొన్న జరిగిన ఎన్నికల ముందు వరకు జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల్లో మమేకం అయ్యాడు.ఇప్పుడు పవన్ కూడా పాదయాత్ర చేపడితే ఏదైనా ఫలితం ఉండే అవకాశం ఉందంటూ కొంతమంది తమ వాదన వినిపిస్తున్నారు.ప్రస్తుతం పవన్ రాజకీయ భవిష్యత్తు మెరుగుపడాలంటే ఇదే ఆయనకు కనిపిస్తున్న బెటర్ ఆప్షన్ అని రాజకీయ మేధావులు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube