Nayanthara Vignesh Shivan: అందం కోసం నయనతార తన భర్తను అంత ఇబ్బంది పెడుతుందా.. వామ్మో మామూలు తిప్పలు కావుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార( Nayanthara ) తన అందం కోసం తను కాకుండా తన భర్త చాలా తిప్పలు పడతాడా అంటే అవునని అంటున్నారు కోలీవుడ్ మీడియా వర్గాలు.నయనతార గురించి కోలీవుడ్ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి అని చెప్పాలి.

 Is Nayanthara Bothering Her Husband So Much For Her Beauty-TeluguStop.com

తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలో సూపర్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

నటనపరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార అందం పరంగా కూడా ఎంతోమందిని ఫిదా చేసింది.

ఇప్పటికీ ఆమె అందంలో ఎటువంటి మార్పు లేదని చెప్పాలి.రోజురోజుకు వయసుతో పాటు అందం కూడా పెంచుకుంటూ పోతుంది నయనతార.

ఇక వయసు కనిపించకుండా అందంతో కవర్ చేస్తుంది.ఇక ఈమె నటిగా ఎంత మంచి పేరు సంపాదించుకుందో వ్యక్తిగతంగా అంతా హాట్ టాపిక్ గా నిలిచింది.

Telugu Vignesh Shivan, Kollywood, Nayanthara Diet, Nayanthara-Movie

పెళ్లికి ముందు గతంలో నయనతార హీరో శింబు, ప్రభుదేవలతో గాఢంగా ప్రేమాయణం చేసింది.కానీ కొన్ని కారణాల వల్ల వాళ్లకు బ్రేకప్ చెప్పేసింది.ఆ సమయంలో ఈమె వార్తలు బాగా హాట్ టాపిక్ గా నిలిచినప్పటికీ కూడా.అవకాశాలు మాత్రం అస్సలు తగ్గలేదు. దర్శక నిర్మాతలు ఈమెకు పోటీపడి మరి అవకాశాలు ఇచ్చేవారు.

అలా ఒక వైపు తెలుగులో, మరోవైపు తమిళంలో సినిమాలు చేస్తూ బాగా క్రేజ్ సంపాదించుకుంది.

అదే సమయంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన విగ్నేష్ శివన్ తో( Vignesh Shivan ) ఒక సినిమా చేయగా ఆ సమయంలో వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.అలా చాలా వరకు విగ్నేష్ సినిమాలో నటించింది.

అంతే కాకుండా వీరిద్దరు కొంతకాలం సహజీవనం చేసి అందరి దృష్టిలో పడ్డారు.

Telugu Vignesh Shivan, Kollywood, Nayanthara Diet, Nayanthara-Movie

ఆ సమయంలో నయనతార ఇతడిని కూడా దూరం పెడుతుంది అని చాలామంది అనుకున్నారు.కానీ కొన్ని రోజులకే అతడిని వివాహం చేసుకుంది.ఇక ఏడాది తిరగక ముందే సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.

ఇక విగ్నేష్ పిల్లల బాధ్యతలతో పాటు తన సినిమా బాధ్యతలను కూడా చూసుకుంటున్నాడు.

నయనతార కూడా ఎక్కువ సమయం సినిమాలతోనే గడుపుతుంది అని తెలిసింది.

ఇక విగ్నేష్ నయనతార బాధ్యతలు కూడా తీసుకుంటాడని తాజాగా తెలిసింది.అది కూడా ఆమె అందం విషయంలో.

అదేంటంటే నయనతార ఉదయాన్నే వాకింగ్, జాగింగ్, యోగ ఇందులో ఏదో ఒకటి కచ్చితంగా చేస్తుందట.ప్రతి రోజు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగుతుందట.

డైట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కొబ్బరినీళ్లు, కొబ్బరి ఖచ్చితంగా తీసుకుంటుందట.

Telugu Vignesh Shivan, Kollywood, Nayanthara Diet, Nayanthara-Movie

ఇక కార్బోహైడ్రేట్స్ కు చాలా దూరం ఉంటుందట.ఫ్యాటీ ఐటమ్స్, స్వీట్స్, షుగర్ కంటెంట్ ఉన్న పదార్థాలను దూరం పెట్టేస్తుందట.కూల్ వాటర్, డీప్ ఫ్రై ఐటమ్స్ ను తీసుకోదట.

ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తోనే తన పొట్టని నింపుకుంటుందని, ఎక్కువగా వాటర్ తాగుతుందని, మరి ముఖ్యంగా కొబ్బరి నీళ్ళు రోజుకి నాలుగు గ్లాసులు కూడా తాగేస్తూ ఉంటుందని తెలుస్తుందని తెలిసింది.

అయితే అందం కోసం నయనతార ఒక వైపు సినిమాలు చేస్తూ ఇంత డైట్ ను ఎలా ఫాలో అవుతుంది అని అనుకుంటున్నారా.

ఇదంతా విగ్నేష్ చేతిలోనే ఉంటుందని తెలిసింది.కరెక్టు టైం కు విగ్నేష్ నయనతారకు ఇవన్నీ అందిస్తుంటాడని తెలిసింది.

ఇక ఈ విషయం ప్రస్తుతం అంతట పాకటంతో.పాపం విగ్నేష్.

భార్య అందం కోసం మామూలు తిప్పలు పడట్లేదు కదా అని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube