నయన్ పాప మళ్ళీ బ్రేకప్ చెప్పిందంటగా...

ఒకప్పుడు తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించినటువంటి ముద్దుగుమ్మ “నయనతార” గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.నయనతార ఇప్పటివరకు దాదాపుగా 60కి పైగా చిత్రాల్లో తెలుగు తమిళం భాషల్లో కలిపి హీరోయిన్ గా నటించింది.

 Nayanthara, Vignesh Shivan, Breakup News, Kollywood, Director Vignesh Shivan-TeluguStop.com

అయితే సినిమాల పరంగా మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి నయనతార తన జీవిత భాగస్వామి విషయంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేక పోతోంది.

ఈ కారణంగా ఇప్పటివరకు దాదాపుగా ముగ్గురు హీరోలతో ప్రేమ పెటాకులైనట్లు సినీ పరిశ్రమ కోడైకూస్తోంది.

అయితే తాజాగా ఇటీవలే నయనతార కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా చెట్టాపట్టాలేసుకొని వెళ్లేవారు.

దాంతో ఇద్దరూ తొందరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు పలు వార్తలు అప్పట్లో బలంగా వినిపించాయి. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందో ఏమోగానీ నయనతార మరియు విఘ్నేశ్ శివన్ ల మధ్య మనస్పర్ధలు మొదలైనట్లు, అంతేగాక ఈ విభేదాలు రోజురోజుకి పెరగడంతో నయనతార బ్రేకప్ చెప్పినట్లు పలువురు తమిళ సినీ పరిశ్రమలో బలంగా చర్చించుకుంటున్నారు.

అయితే ఈ విషయంపై నెటిజన్లు నయనతారను బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.జీవిత భాగస్వామి విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని మంచి భాగస్వామి ని ఎన్నుకోవాలని నయనతారకి పలువురు అభిమానులు సూచిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నయనతార కోలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.ఇందులో భాగంగా దాదాపుగా నాలుగు చిత్రాల షూటింగులతో ప్రస్తుతం ఈ అమ్మడు బిజీబిజీగా గడుపుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube