కమర్షియల్ వల్లే నాని విఫలం అవుతున్నాడా !

టాలీవుడ్ న్యాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు నాని.తన న్యాచురల్ నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి వారికీ మరింత దగ్గర అయ్యాడు.

 Is Nani Failing Due To Commercial Movies , Nani, Commercial Movies, Tuck Jagadis-TeluguStop.com

నాని ఎప్పుడు విభిన్న కథలను ఎంచుకుంటూ మినిమమ్ గ్యారెంటీ హిట్ కొడుతూ అందరిని ఆశ్చర్య పరిచేవాడు.తన సినిమాల కథ ఎంపిక విషయంలో నాని చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు.

వరుసగా అరడజను సినిమాలకు పైగానే హిట్స్ అంటే ఏ హీరోకు సాధ్యం కాదు.

కానీ నాని మాత్రం అది నిరూపించాడు.

ఒక సినిమాను మించి ఇంకొక సినిమా ఉండేలా జాగ్రత్త పడుతూ వరుస హిట్స్ కొట్టాడు.తాను ఎంచుకునే డైరెక్టర్స్ కూడా నాని ఆ స్థాయికి రావడానికి ప్రధాన కారణమనే చెప్పవచ్చు.

అయితే ఈ మధ్య నాని ఎంపిక బెడిసి కొడుతోంది.వరుసగా సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.

దీంతో ఎక్కడ తప్పు జరుగుతుందా అని నాని పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా నాని కమర్షియల్ సినిమాలు చేయడం వల్లనే సినిమాలు ప్లాప్ అవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.

ఈ కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పటి నుండి ఒకటి హిట్ అయితే రెండు ప్లాప్ అవుతున్నాయి.ఈ మధ్య కథ సెలెక్షన్ పూర్ గా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

ప్రెసెంట్ నాని చేసిన టక్ జగదీశ్ సినిమా కూడా ప్లాప్ అవవడానికి రాంగ్ కథ సెలెక్షన్ అనే అంటున్నారు.

Telugu Nani Due, Nani, Siva Nirvana, Tuck Jagadish, Tuckjagadish-Movie

ఎప్పుడు ప్రేమ కథలు తీసే శివ నిర్వాణ కమర్షియల్ కథ తీయడంలో విఫలం అయ్యాడు.ఇంకా మంచి కథ తీయగలితే అటు శివ నిర్వాణ కు ఇటు నానికి ప్లస్ అయ్యేది.కానీ ఇలాంటి సినిమాను ప్రేక్షకులు వీరిద్దరి నుండి ఆశించలేదు.

ఇక ముందు ముందు అయినా నాని కమర్షియల్ సినిమాలు పక్కన పెట్టి మంచి మంచి కథలను ఎంచుకుంటూ హిట్స్ కొట్టాలని నాని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube