నాగచైతన్య లవ్ స్టోరీ రిలీజయ్యేది అప్పుడేనా..?

జోష్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సినీ కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క 50 కోట్ల రూపాయల సినిమా కూడా లేదు.నాగచైతన్య మాస్ హీరో అవుదామని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఫ్లాప్ అయ్యాయే తప్ప హిట్ కాలేదు.

 Is Nagachaitanya Sai Pallavi Love Story Movie Release Date Fixed, August, Love S-TeluguStop.com

ప్రేమమ్, మజిలీ, మనం, 100% లవ్ నాగచైతన్య సినీ కెరీర్లో బెస్ట్ హిట్లుగా నిలిచాయి.ప్రస్తుతం నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాతో పాటు థ్యాంక్యూ సినిమాలలో నటిస్తున్నారు.

ఏప్రిల్ 16వ తేదీన లవ్ స్టోరీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా రిలీజ్ కాలేదు.శేఖర్ కమ్ముల ఫిదా సినిమా తరువాత దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా బిజినెస్ భారీగా జరిగింది.

అయితే ఈ సినిమా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆగష్టు నెలకు వాయిదా పడిందని సమాచారం.మరోవైపు ఆగష్టు నెలలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని పలువురు పెద్ద సినిమాల నిర్మాతలు సైతం భావిస్తున్నారు.

అయితే లవ్ స్టోరీ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Telugu August, Love Story, Nagachaitanya, Fixed, Sai Pallavi, Saranga Dhariya, S

చైతన్య ఫ్యాన్స్ తో పాటు సాయిపల్లవి ఫ్యాన్స్ లవ్ స్టోరీ మూవీ కోసం ఎదురు చూస్తుండటం గమనార్హం.సారంగ దరియా పాట యూట్యూబ్ వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేయగా ఆ పాట కోసమే సినిమాను చూసే ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.సారంగదరియా పాటలో సాయిపల్లవి వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Telugu August, Love Story, Nagachaitanya, Fixed, Sai Pallavi, Saranga Dhariya, S

మరి నాగచైతన్య ఆశించిన స్థాయిలో లవ్ స్టోరీ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.ఈ సినిమాతో పాటు నాగచైతన్య థ్యాంక్యూ సినిమాలో నటిస్తుండగా ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube