గోపీచంద్‌ ముత్యాలముగ్గు

బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముత్యాల ముగ్గు’ చిత్రం సూపర్‌ హిట్‌ అయిన విషయం తెల్సిందే.ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ చిత్రం.

 Is Mutyala Muggu Is Gopichand’s Next?-TeluguStop.com

మళ్లీ ఇన్నాళ్లకు ఆ టైటిల్‌తో సినిమా చేసేందుకు భవ్య క్రియేషన్స్‌ వారు రెడీ అవుతున్నారు.ఈ టైటిల్‌తో గోపీచంద్‌ హీరోగా నటించే అవకాశాలున్నాయని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం గోపీచంద్‌ నటిస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత ‘ముత్యాల ముగ్గు’ చిత్రంలో నటిస్తాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

గతంలో భవ్య క్రిషన్స్‌లో గోపీచంద్‌ నటించిన చిత్రాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.

దాంతో ఈ సినిమాపై ఇప్పటి నుండే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.హిట్‌ కాంబినేషన్‌తో పాటు, హిట్‌ సినిమా టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారు అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను భవ్య క్రియేషన్స్‌ వారు చేసే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది.ఇటీవలే ఫిల్మ్‌ ఛాంబర్‌లో ‘ముత్యాల ముగ్గు’ టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube