మటన్ ఆరోగ్యానికి మంచిదేనా..?

ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్ లకు అలవాటు పడ్డారు.చిన్న,పెద్ద అనే తేడా లేకుండా హోటల్స్ మరియు డాబా లకు వెళ్లి అక్కడ దొరికే చికెన్,మటన్ ఇలాంటి వాటికి పూర్తిగా అలవాటు పడ్డారు.

 Is Mutton Healthy-TeluguStop.com

ఇక మనకు బయట దొరికే చికెన్, మటన్ లాంటివి మంచిదేనా అంటే కొద్దిసేపు ఆలోచించుకొని చెప్పాలి.ఎందుకంటే అక్కడ వాడు చేసే మాంసం ఎప్పుడు దో ఎలా ఉంటుందో తెలియదు కానీ మనం నిరంతరం తింటూనే ఉంటాం.

ఇక పెద్ద పెద్ద హోటల్స్ చూసుకుంటే ఎప్పుడూ ఫుల్ బిజీ గా ఉంటాయి.ఇక హైదరాబాద్ అలాంటి నగరాలలో ఇంకా చెప్పాల్సిన పనిలేదు.హైదరాబాద్ నగరంలో చూసుకుంటే అక్కడ లభ్యమయ్యే మటన్ సురక్షితమేనా లేదా ఆ హోటల్లు సురక్షిత మాంసాహారాన్ని వినియోగదారులకు అందిస్తున్న రాలేదా అని అడిగితే అవును అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

 Is Mutton Healthy-మటన్ ఆరోగ్యానికి మంచిదేనా..-Business - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Biriyani, Doctors, Greater Hyderabad, Healthy, Hotels, Mutton-General-Telugu

చిన్నా చితకా హోటల్స్ విషయం పక్కన పెడితే, నిత్యం లక్షల్లో వ్యాపారం, వేల సంఖ్యలో వినియోగదారులు వచ్చే బడా హోటల్ సైతం కక్కుర్తి పడుతున్నాయి.ఇక మాకు ఏ డోకా లేదు అనుకుంటున్నా ఆహార విక్రయ సంస్థలుకూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.గురువారం పలు ప్రముఖులు హోటల్స్ ని తనిఖీ చేసి ఆ హోటల్లో జిహెచ్ఎంసి ముద్ర లేని మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

ఇందుకుగాను ఒక్కో హోటల్ కి 25 వేల వరకు జరిమానా విధించారు.ఒకవైపు బర్డ్ ఫ్లూ భయం ఉంది.తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి మటన్ చర్చనీయాంశంగా మారింది.నాణ్యత రహిత మటన్ విక్రయం మాంసాహార ప్రియులకు మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

ఇది ఇలా ఉండగా గ్రేటర్ లో హోటల్స్ మరియు మటన్ విక్రయ దుకాణాలు వేల సంఖ్యలో ఉన్నాయి.వీటన్నింటికీ కబేళాల నుంచి మటన్ సరఫరా అవుతోంది.

నిబంధనల ప్రకారం కబేళాల వద్ద జిహెచ్ఎంసికి చెందిన వెటర్నరీ డాక్టర్ లు ఆ గొర్రెలు మేకలు పరిశీలించి అవి ఆరోగ్యంగా ఉన్నాయా లేదా నిర్ధారించిన తర్వాత వాటిని కోయాలి.అలాంటి మాంసాన్ని మాత్రమే హోటల్లో వినియోగించాలి దుకాణాలకు పంపించాలి.

గ్రేటర్ లో అలాకాకుండా చనిపోయిన గొర్రెలు మేకల కళేబరాలను విక్రయం చేస్తున్నారు.కొన్నిసార్లు వెటర్నరీ డాక్టర్ లు అందుబాటులో ఉండటం లేదు ఉన్నా కూడా గొర్రెలు మేకల వంటి వాటిని పరిశీలించడం లేదు.

ఇంత జరుగుతున్నా కూడా అక్కడ అధికారులుపట్టించుకోవడం లేదు.

#Doctors #Mutton #Hotels #Healthy #Biriyani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు