అప్పుడు ఈమెను బిగ్‌బాస్‌ కాపాడాడు.. ఇప్పుడు ప్రేక్షకులు కాపాడుతున్నారు

తెలుగు బిగ్‌బాస్‌లో మోనాల్‌ ఇన్ని వారాలు నెగ్గుకు రావడం అందరిని ఆశ్చర్యపర్చుతుంది.దేవి, దివి, కుమార్‌ సాయి మరియు మెహబూబ్‌ల కంటే ఖచ్చితంగా మోనాల్‌ స్ట్రాంగ్‌ కాదు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.

 Is Monal Stand In Telugu Bigg Boss Final 5, Akhil Monal, Akhil Vs Abhijith, Bigb-TeluguStop.com

కాని బిగ్‌బాస్‌ టీం వారు మాత్రం మోనాల్‌ను ఇన్ని వారాలు కొనసాగించారు.అఖిల్‌తో ఆమె ప్రేమ వ్యవహారం వల్ల ఖచ్చితంగా రేటింగ్‌ బాగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఓట్లు రాకున్నా కూడా ఆమెను వరుసగా సేవ్‌ చేస్తూ వచ్చారు.

అలా సేవ్‌ చేసిన బిగ్‌బాస్‌ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు.కుమార్‌ సాయి మరియు మోనాల్‌లు ఎలిమినేషన్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మోనాల్‌ వెళ్తుంది అనుకుంటే అనూహ్యంగా కుమార్‌ సాయి వెళ్లి పోయాడు.

మెహబూబ్‌ విషయంలో కూడా అదే జరిగింది.మోనాల్‌ను ఎందుకు ఇంతగా సేవ్‌ చేస్తున్నారు అంటే చిన్న పిల్లలు కూడా చెప్పే విధంగా కారణం మారిపోయింది.

ఇప్పుడు అఖిల్‌ మరియు మోనాల్‌ల మద్య వ్యవహారం సరిగా లేదు.ఆమెను ఇన్నాళ్లు కాపాడుతూ వచ్చినా కూడా ఇప్పుడు ప్రేక్షకులు ఆమెను సేవ్‌ చేస్తూ వస్తున్నారు.అనూహ్యంగా ఆమె చేస్తున్న టాస్క్‌లు మరియు ఇతర పెర్ఫార్మెన్స్‌ కారణంగా ఆమె ఉండాలని అనుకుంటున్నారు.టాఫ్‌ 5 లో ఆమె ఉండటం కోసం ఖచ్చితంగా ఓట్లు పడుతాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

అఖిల్‌ తో గొడవ కారణంగా అభిజిత్‌ అభిమానులకు మోనాల్‌ ఫేవరేట్‌గా మారే అవకాశం ఉంది.ఆ కారణంతో ఖచ్చింగా మోనాల్‌ కు ముందు ముందు అభిమానులు క్రియేట్‌ అయ్యే అవకాశం ఉంది.

కనుక టాఫ్‌ 5 వరకు వెళ్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి బిగ్‌బాస్‌ నుండి అంత ఈజీగా సింపుల్‌గా వెళ్లి పోకుండా మోనాల్‌ చాలా ఏదోలా ఇక్కడి వరకు వచ్చింది.

ఆమె తీరుకు నిజంగా హ్యాట్సాఫ్‌ అంటూ కొందరు అంటూ ఉంటే కొందరు మాత్రం ఆమె తన లేడీ కార్డును ఏడుపును ఉపయోగించి ఇప్పటి వరకు ఆడింది అంటున్నారు.ఏది ఏమైనా ఆమె ఫైనల్‌ 5 లో ఉండే అవకాశాలు ఎక్కవగా కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube