టీడీపీలో ఘంటా- తంటాలు ! ఉండాలా వద్దా ..?

తెలుగుదేశం పార్టీలో అలుముకున్న అసంతృప్తుల పర్వం ముదిరి పాకనపడింది.ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని అధినేతకు తెలిసేలా వ్యవహరిస్తున్నారు.

 Is Minister Ganta Srinivasa Quit Tdp-TeluguStop.com

ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కీలకంగా ఉన్న మంత్రి ఘంటా శ్రీనివాసరావు వ్యవహారం ఇప్పుడు టీడీపీ లో హాట్ టాపిక్ గా మారింది.చాలాకాలంగా టీడీపీకి అంటి ముట్టనట్టుగా ఉంటున్న మంత్రి గంటా .పార్టీ కార్యక్రమాలకు, అధికారిక సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు.తాజాగా విశాఖలో ఈ రోజు జరగనున్న ముఖ్యమంత్రి పర్యటనపై ఘంటా వివాదస్పద వ్యాఖ్యలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

సిఎం చంద్రబాబు ఈ రోజు విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో గంటా హాజరువుతారా లేదా అన్న ఆసక్తి అందరిలోనూ .నెలకొంది.విశాఖపట్నంలోనే గంటా ఉండి కూడా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పట్టించుకోవడంలేదు.ప్రొటోకాల్ వ్యవహారాలు కూడా చూడడంలేదు.మీడియా వెళ్లి సీఎం టూరు గురించి ఆయనను అడిగితే.చంద్రబాబు వస్తున్నారా అంటూ ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇటీవల మీడియాలో గంటాకు వ్యతిరేకంగా సర్వేలు వస్తున్నాయి.బీమిలిలో టీడీపీ ఓడిపోతుందంటూ ప్రచారం జరుగుతోంది.అయితే దీని వెనక సొంత పార్టీ నేతలే ఉన్నారని, తనను రాజకీయంగా దెబ్బతీయడానికి సర్వేల పేరుతో కుట్రలు చేస్తున్నారని ఘంటా ఆవేదన చెందుతున్నారట.ఓటమి లేకుండా వరుస విజయాలతో వెళుతున్న తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా తెరవెనక కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

అధిష్టానం కూడా ఈ విషయంలో తనకు అండగా ఉండకపోవడంతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది.

విశాఖ భూముల కుంభకోణంలో తనపై కేసులు వేయడం వెనక కూడా సొంత పార్టీ నేతలు ఉన్నట్టు గంటా చెబుతున్నారు.

ఇలా పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల తట్టుకోలేక దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.ఘంటా పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది.చంద్రబాబు కూడా ఈయనకు ప్రాధాన్యత తగ్గించినట్టు… ఉంటే ఉంటాడు పోతే పోతాడు అనే ధోరణిలో బాబు కూడా ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube