తెలంగాణలో బీజేపీ అన్ని విధాలుగా బలపడాలని చూస్తున్న బీజేపీ ఇక ఇతర పార్టీల కీలక నేతలపై దృష్టి సారించింది.ఎటువంటి లీకులకు తావు లేకుండా కీలక నేతలపై గురిపెట్టిన బీజేపీ ఆ సదరు నేతలెవరో బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు.
కాని తాజాగా కరీంనగర్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ బీజేపీలో చేరికపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.కొన్ని నెలల క్రితం జరిగిన ఓ వ్యవహారంలో టీఆర్ఎస్ వ్యవహరించిన తీరుపై గంగుల అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.
కరీంనగర్ లో బలమైన నేతగా ఉన్న గంగుల తాను వ్యక్తిగతంగా గెలగలిగే సామర్థ్యం ఉండడంతో పార్టీలపై ఆధారపడి తన గెలుపు ఉండదని జరిగిన పలు ఘటనల ద్వారా మనం విశ్లేషించుకోవచ్చు.కాని ఈ ప్రచారంతో టీఆర్ఎస్ పార్టీ నుండి ఎటువంటి స్పందన లేకపోయినా, ఈ వార్తలని మంత్రి గంగుల కమలాకర్ కూడా ఖండించకపోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్టవుతోంది.
ఇది బీజేపీ వ్యూహమా, ఇటువంటి లీకులతో టీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేయడమే ప్రధాన వ్యూహం అయితే మాత్రం ఇలాంటి కీలక నేతలపై మరిన్ని లీకులు వస్తేనైనా మరి టీఆర్ఎస్ స్పందిస్తుందా అనేది చూడాల్సి ఉంది.