పెళ్లి చేసుకోబోతున్న మెగా స్టార్ హీరోయిన్...

నాలుగు పదుల వయస్సు దగ్గర పడుతున్నప్పటికీ వన్నె తరగని అందంతో అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తే ఉన్నటువంటి అందాల తార త్రిష.ఈమె అప్పట్లో దాదాపుగా అందరి ప్రముఖ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా వెలుగొందారు.

 Is Megastar Heroin Trisha Is Going To Marry-TeluguStop.com

అయితే ఆ మధ్య అవకాశాలు తగ్గడంతో తన మకాంని చెన్నైకి మార్చింది.అయితే అక్కడ కూడా అడపాదడపా అవకాశాలతో తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమించారు త్రిష.

అయితే కెరియర్ ఇక అయిపోయిందని అనుకున్న సమయంలో చెన్నైకి చెందినటువంటి ఓ వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్ధపడింది.అంతేగాక అతడితో నిశ్చితార్ధం కూడా చేసుకుంది.

అయితే ఏమైందో ఏమో కానీ తీరా పెళ్లిపీటలు ఎక్కే సమయానికి అతనితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధపడింది త్రిష.

అయితే తాజాగా ఈ అమ్మడు తన అభిమానులతో సరదాగా సోషల్ మీడియా అయినటువంటి ఇంస్టాగ్రామ్ చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా కొంతమంది తన అభిమానులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.అయితే ఇందులో భాగంగా ఓ నెటిజన్  ప్రస్తుతం మీ బకెట్ లిస్ట్ లో ఉన్నటువంటి ఒక కోరికను చెప్పండని ప్రశ్నించాడు.

Telugu Trisha, Trisha Latest, Trishareacts, Trishatollywood-Movie

అయితే ఇందుకు త్రిష సమాధానమిస్తూ ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన లాస్ వేగాస్ లో వివాహం చేసుకోవాలని ఉందని సమాధానం ఇచ్చారు.దీంతో ఒక్కసారిగా త్రిష అభిమానులంతా అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు, మరియు వరుడు ఎవరు అంటూ ప్రశ్నల హోరెత్తించారు.అయితే వీటన్నిటికీ మాత్రం త్రిష స్పందించలేదు.

అయితే ప్రస్తుతం త్రిష దాదాపుగా పది సినిమాల్లో నటిస్తోంది.

ఇందులో ముఖ్యంగా టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన జత కడుతోంది ఈ అమ్మడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube