మెగాస్టార్ చిరంజీవి బీజేపీ పార్టీలో చేరనున్నారా ..?  

Is Chiranjeevi Joining BJP Party..?,Chiranjeevi, megastar, BJP party, Tollywood, Smo Virraju, AP BJP New President - Telugu Ap Bjp New President, Bjp Party, Chiranjeevi, Is Chiranjeevi Joining Bjp Party..?, Megastar, Smo Virraju, Tollywood

తెలుగు సినీ పరిశ్రమలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ మరియు అభిమానుల ఫాలోయింగ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే చిరంజీవి ఒకపక్క  తన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే మరోపక్క ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టి ఆ తర్వాత అనుకోకుండా ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసాడు.

 Is Megastar Chiranjeevi Want To Join In Bjp Party

ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు.

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ని తన సొంత నివాసంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసాడు.

మెగాస్టార్ చిరంజీవి బీజేపీ పార్టీలో చేరనున్నారా ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా గా 2024 వ సంవత్సరం లో జరిగే ఎన్నికల లో చేయాల్సిన కార్యచరణ గురించి కొంతసేపు సంభాషించారు. అనంతరం పూల మాలలతో సోము వీర్రాజు ని  మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు.

దీంతో విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అంతేగాక కొంతమంది ఈ భేటీ గురించి స్పందిస్తూ 2024 వ సంవత్సరం లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి భారత జనతా పార్టీ తరపున పోటీ చేయనున్నారని, అందువల్లనే బీజేపీ పార్టీ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.

కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం తాను బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్నటువంటి వార్తలపై మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.  కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు.

కాగా ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో మంచి విజయం సాధించిన  “లూసిఫర్” అనే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

#Megastar #APBJP #Bjp Party #Chiranjeevi #IsChiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Is Megastar Chiranjeevi Want To Join In Bjp Party Related Telugu News,Photos/Pics,Images..