మహేష్ జవానా? ఫ్యాక్షనిష్టా?  

Is Mahesh Babu Is A Jawan Or Factionist In Sarileru Nikevvaru - Telugu Kondareddy Buruju, Mahesh Babu, Sarileru Nikevvaru, Tollywood Box Office, Vijaya Shanthi

“మహర్షి” వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు నటిస్తున్న ఆయన 26వ సినిమా “సరిలేరు నీకెవ్వరు”.ఈ సినిమా ఫస్ట్ లుక్ ను బట్టి ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ అని అర్థం అయ్యింది.

Is Mahesh Babu Is A Jawan Or Factionist In Sarileru Nikevvaru

ఇప్పటి వరకు కనిపించని విభిన్నమైన పాత్రలో మహేష్ కనిపించబోతున్నాడు అని ఫ్యాన్ చాలా సంతోషించారు.ఇలాంటి సమయంలో దసరా పండుగ సందర్భంగా సినిమా నుండి కొత్త పోస్టర్ వచ్చింది.

ఆ పోస్టర్ ప్రస్తుతం సినిమాపై అంచనాలు పెంచుతోంది.

మహేష్ జవానా ఫ్యాక్షనిష్టా-Movie-Telugu Tollywood Photo Image

సరిలేరు నీకెవ్వరు సినిమా లో కీలక సన్నివేశాలు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద షూట్ జరుపుకుంటున్నాయి.

కొన్ని సీన్స్ ను కర్నూలు లోని బురుజు వద్ద షూట్ చేస్తే మరి కొన్ని సీన్స్ కోసం ఫిల్మ్ సిటీలో కొండా రెడ్డి బురుజు సెట్ ను వేయడం జరిగింది.అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.

ఇక దసరా సందర్భంగా మహేష్ బాబు కొత్త పోస్టర్ వచ్చింది.ఆ పోస్టర్ లో మహేష్ బాబు కొండారెడ్డి బురుజు వద్ద గొడ్డలి పట్టుకుని ఫ్యాక్షనిష్టు తరహాలో నిలుచున్నాడు.

 సినిమాలో మహేష్ బాబు ఒకవైపు ఆర్మీ జవాన్ గా కనిపిస్తూనే మరో వైపు ఇలా తన సొంత ప్రాంతం కోసం తన వారికోసం రాయలసీమలో ఫ్యాక్షన్ కూడా చేస్తాడని అనిపిస్తుంది.సినిమాలోని పలు షేడ్స్ తో పాటు కామెడీ కూడా ఫుల్ గా ఉంటుందని అంటున్నారు.సంక్రాంతికి అనిల్ రావిపూడి ఈ సినిమాను తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.మహేష్ మహర్షి మరియు అనిల్ ఎఫ్2 సినిమాల తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఫీక్స్ లో ఉన్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు