కాలేజ్ ప్రొఫెసర్‌ గా మెగాస్టార్ , మరి సూపర్ స్టార్ ఏంటో తెలుసా...?  

Is Mahesh Babu Playing Student Role In Chiru Movie - Telugu Chiranjeevi Acharya Movie Latest News, Chiranjeevi Acharya Movie News, Chiranjeevi Movie News, Chiranjeevi News, Mahesh Babu Latest News, Mahesh Babu Movie Latest Update, Mahesh Babu Movie News

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కోలీవుడ్ బ్యూటీ త్రిష నటిస్తోంది.

 Is Mahesh Babu Playing Student Role In Chiru Movie

ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు.అయితే ఈ చిత్ర కథనానికి సంబంధించిన పలు వార్తలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

ఇందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నటిస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

కాలేజ్ ప్రొఫెసర్‌ గా మెగాస్టార్ , మరి సూపర్ స్టార్ ఏంటో తెలుసా…-Latest News-Telugu Tollywood Photo Image

ఇందులో మెగాస్టార్ చిరంజీవి పేరు పొందినటువంటి విశ్వవిద్యాలయంలో కాలేజీ ప్రొఫెసర్ గా పని చేస్తుంటాడని ఆ ప్రొఫెసర్ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను రీత్యా ప్రొఫెసర్ కాస్త మావోయిస్ట్ లీడర్ గా మారతాడని పలు కథనాలు వినిపిస్తున్నాయి.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కూడా కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేటటువంటి కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నాడని అంతేగాక మహేష్ బాబు ఓ పవర్ ఫుల్ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా కనిపిస్తారని ఇప్పటికే ఈ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయిందని పలు వార్తలు నెట్ లో బాగానే వైరల్ అవుతున్నాయి.అయితే వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనే ఈ విషయంపై మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత లేదు.

గతంలో కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఈ చిత్రంలో 30 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఓ సన్నివేశంలో నటిస్తున్నాడని పలు వార్తలు వినిపించాయి.

అయితే ఈ విషయంపై కూడా చిత్ర యూనిట్ సభ్యులు స్పందించలేదు.దీంతో మెగా అభిమానులు ఈ వార్తలన్నీ గాలివార్తలు గా కొట్టి పడేశారు.అయితే ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నాడనే వార్తలు మరింత ఎక్కువ అవుతున్నాయి.కనీసం ఈ వార్తలపై ఐనా చిత్ర యూనిట్ సభ్యులు స్పందిస్తారో లేదో చూడాలి.

ఏదేమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నాడు అనే వార్తలు వదంతులే అయినప్పటికీ మెగా అభిమానులకు మాత్రం పండగ చేసుకుంటున్నారు.ఎందుకంటే మెగాస్టార్ మరియు సూపర్ స్టార్ ఇద్దరు కలిస్తే బాక్సాఫీస్ మాత్రం బద్దలవడం ఖాయం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test