మహేష్ కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే ప్రత్యేకంగా మాస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి.ఎక్కువగా క్లాస్ యూత్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేసాడు సూపర్ స్టార్.
రాజకుమారుడు,మురారి,అతడు,దూకుడు,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు … ఇలా మహేష్ హిట్లలో సింహభాగం ఫ్యామిలి సినిమాలదే.ఒక్కడు,పోకిరి,బిజినెస్ మెన్ .ఇవి మాత్రమే మాస్ మంత్రంతో హిట్లు అయిన సినిమాలు.
మహేష్ సినిమా అంటే ఎక్కువ యూత్,ఫ్యామిలి,ఫిమేల్ ఆడియెన్స్ వస్తారు.
పక్కా మాస్ ప్రేక్షకుల్లో మహేష్ అంటే అభిమానం ఉన్నప్పటికీ అది మరీ విపరీతం కాదు.మరీ అందంగా ఉండటం ఒక కారణమైతే, ఆయన ఇప్పటిదాకా పాటించిన పధ్ధతి మరో కారణం .
ఆగడు హిట్ అయ్యుంటే బాగుండేది కాని అది కాస్త డిజాస్టర్ గా నిలిచింది.శ్రీమంతుడు అంత పెద్ద హిట్ అయినా, సీడెడ్ లాంటి ఏరియాలో మహేష్ రేంజ్ హిట్ గా నిలవలేదు.
మహేష్ తరువాతి సినిమా బ్రహ్మోత్సవం.ఇది కుడా పక్కా ఫ్యామిలి చిత్రం.
ఇప్పటికైనా మహేష్ వినాయక్, బోయపాటి,హరీష్ శంకర్ లాంటి దర్శకులకి అవకాశాలిచ్చి , తనకి లోటుగా మిగిలే సీడెడ్, నెల్లూరు ఏరియాలను కుడా దత్తత తీసుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.