'మహర్షి' ఎంత వసూళ్లు చేస్తే బ్లాక్‌ బస్టర్‌ తెలుసా.. 80 కోట్లు వసూళ్లు చేసినా ఫ్లాపే ఎందుకో తెలుసా?  

Is Maharshi Movie Will Break Box Office Records-maharshi Box Office Report,maharshi Movie Collections,mahesh Babu,మహర్షి,మహేష్‌ బాబు

మహేష్‌ బాబు హీరోగా నటించిన 25వ చిత్రం ‘మహర్షి’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘మహర్షి’ చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ 150 కోట్లు చేసిన విషయం తెల్సిందే. కేవలం థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా 100 కోట్ల రూపాయలను ఈ చిత్రం నిర్మాతలకు తెచ్చి పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహర్షి చిత్రం గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్‌ అయితే దక్కించుకోవడం ఖాయం. కాని చిత్రం కేవలం ఓపెనింగ్స్‌ దక్కించుకుంటే సరిపోదు. ఖచ్చితంగా భారీ వసూళ్లను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది..

'మహర్షి' ఎంత వసూళ్లు చేస్తే బ్లాక్‌ బస్టర్‌ తెలుసా.. 80 కోట్లు వసూళ్లు చేసినా ఫ్లాపే ఎందుకో తెలుసా?-IS Maharshi Movie Will Break Box Office Records

100 కోట్ల బిజినెస్‌ చేసింది కనుక ఈ చిత్రం 150 కోట్ల షేర్‌ను దక్కించుకుంటే బ్లాక్‌ బస్టర్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100 కోట్ల మార్కెట్‌ సినిమా అంత సాధించి, అందులో సగంను ఎక్కువ సాధించాలి. ఇక 120 కోట్లకు ఆ పైన సాధిస్తే సూపర్‌ హిట్‌ అయినట్లుగా చెప్పుకోవచ్చు. ఇక 100 కోట్ల నుండి 120 కోట్ల వరకు సాధించినట్లయితే అబౌ యావరేజ్‌ అనుకోవాలి. ఇక 80 నుండి 90 కోట్ల వరకు సాధించినా కూడా యావరేజ్‌ అని చెప్పుకోవాలి.

65 కోట్ల నుండి 79 కోట్ల వరకు సాధించినట్లయితే ఫ్లాప్‌గా చెప్పుకోవాలి. 65 కోట్లకు తక్కువ సాధించినట్లయితే డిజాస్టర్‌ అనుకోవాలి. సినిమా భారీ ఎత్తున బడ్జెట్‌తో రూపొందిన కారణంగా టార్గెట్‌ చాలా పెద్దగా ఉంది. అందుకే ఈ చిత్రం భారీ ఎత్తున వసూళ్లను సాధించాలని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు.