‘మహానటి’ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

వైవిధ్యభరిత చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు క్రిష్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’.సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ చెరగని ముద్రను వేసుకున్న అన్నగారు నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 Is Mahanati Movie Sentiment Work Out With Ntr Bio Pic-TeluguStop.com

ఎన్టీఆర్‌ తనయుడు బాలక్రిష్ణ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తున్నాడు.రెండు పార్టులుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అందులో మొదటి పార్టు ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

టాలీవుడ్‌లో బయోపిక్‌ చిత్రాలకు చాలా క్రేజ్‌ ఉంది.మహానటి సావిత్రి గారి జీవిత చరిత్రతో ‘మహానటి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్‌ను సొంతం చేసుకుంది.అయితే మొదటి నుండి ‘మహానటి’, ‘ఎన్టీఆర్‌’ చిత్రాలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి.‘మహానటి’ చిత్రం తరహాలోనే ‘ఎన్టీఆర్‌’ కూడా ఉండబోతుందని తాజాగా అందుకు సంబంధించిన వార్త ఒకటి ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

‘మహానటి’ చిత్రంలో ఓపెనింగ్‌ ట్రాక్‌ సావిత్రిని హాస్పిటల్‌కు తీసుకెళ్లే సీన్‌ ఉంటుంది.‘ఎన్టీఆర్‌’ చిత్రంలో కూడా ఇదే తరహాలో ఓపెనింగ్‌ సీన్‌ ఉంటుందట.బసవతారకంను ఆసుపత్రికి తీసుకెళ్లి ఆ తరువాత ఎన్టీఆర్‌ తన బాల్యం, యవ్వనంకు సంబంధించిన ఫ్లాష్‌ బాక్‌ ఉంటుందట.ఇలా సినిమా మొదలయిన అరగంట తర్వాత ఎన్టీఆర్‌ సినీ కెరియర్‌ మొదలవుతందని విశ్వసనీయ సమాచారం.

‘మహానటి’కి ఆసుపత్రి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube