ఆంజనేయ స్వామి వివాహం వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా?     2018-05-04   01:01:20  IST  Raghu V

హిందువులు బలానికి,నిగ్రహానికి ప్రతీక అయినా ఆంజనేయ స్వామిని హిందువులు బ్రహ్మచారిగా భావించి కొలుస్తారు. అయితే ఆంజనేయ స్వామికి వివాహం అయిందని కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆంజనేయ స్వామికి నిజంగానే వివాహం అయిందా… అయితే ఎవరితో అయిందో వివరంగా తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి వివాహం గురించి పరాశర మహర్షి ప్రస్తావించారు. సూర్య పుత్రిక అయిన సువర్చలాదేవిని వివాహం చేసుకున్నారని…అసలు ఆ వివాహం ఎలా జరిగింది…వివాహం జరిగితే ఆంజనేయస్వామిని బ్రహ్మచారిగా ఎందుకు పూజిస్తున్నాం. ఆ వివరాలోకి వెళ్ళితే…

ప్రచండమైన సూర్యుని కాంతికి ఆయన భార్య అయిన చాయా దేవి తట్టుకోలేక పుట్టింటికి చేరుతుంది. ఛాయా దేవి తండ్రి అయినా విశ్వకర్మ సూర్య కాంతిని తగ్గించి కూతురిని సూర్య భగవానుని దగ్గరకు పంపిస్తాడు. అప్పుడు వారిద్దరికీ సూర్య తేజస్సును పుణికి పుచ్చుకొని సువర్చలాదేవి జన్మించింది. సూర్య భగవానుడు సువర్చలాదేవి వివాహం కోసం ఆమె తేజస్సును తట్టుకోగలిగిన వరుని కోసం వెతుకుతూ ఉంటాడు.