చిరు వయసు ఆరు పదులు దాట్టిందనే విషయాన్ని కొరటాల మర్చిపోయాడా? ఏంటీ ఈ పిచ్చి టాస్క్‌లు..!

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి కోసం చాలా బక్కగా అయిన విషయం తెల్సిందే.దాదాపు నెల రోజుల పాటు కేరళ వెళ్లి అక్కడ పకృతి వైధ్యం తీసుకుని చిరంజీవి బక్కగా అయిన విషయం తెల్సిందే.ఖైదీ నెం.150 చిత్రంతో పోల్చితే సైరాలో చాలా తక్కువగా వెయిట్‌తో కనిపించబోతున్నాడు.ఆరు పదుల వయసు దాటిన తర్వాత ఈ స్థాయిలో కష్టపడి అంతగా బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదు.అంతటి సాహసం చేసిన చిరంజీవితో కొరటాల శివ మరింత సాహసం చేయించబోతున్నాడట.

 Is Koratala Siva Doing Experiment On Mega Star-TeluguStop.com

చిరంజీవి 152వ చిత్రంకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ఎప్పుడైతే సైరా చిత్రం పూర్తి అవుతుందో అప్పుడే కొరటాల మూవీ ప్రారంభం అవుతుందని అంతా భావించారు.అంటే ఫిబ్రవరి లేదా మార్చిలో సినిమాను పట్టాలెక్కించాలని భావించారు.అందుకోసం నిర్మాత రామ్‌ చరణ్‌ కూడా ఆర్థిక వనరులు సమకూర్చే పనిలో ఉన్నాడు.
]

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రెండు నెలల పాటు ఆలస్యం అవ్వనుందనే టాక్‌ వినిపిస్తుంది.

ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసిన కొరటాల ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను చేస్తున్నాడట.ఆ తర్వాత సినిమాకు సంబంధించిన చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నాడు.

సినిమా కథ నేపథ్యంలో చిరంజీవి చాలా బక్కగా కనిపించాల్సి ఉంటుందట.అంటే ప్రస్తుతం సైరాలో కనిపించే వెయిట్‌ కంటే కూడా ఇంకాస్త తక్కువగా అంటే చిరంజీవి మరో అయిదు నుండి పది కేజీల బరువు తగ్గాల్సి ఉందట.మొత్తానికి చిరంజీవి మళ్లీ వెయిట్‌ తగ్గాల్సిందే అంటూ కొరటాల కోరుతున్నాడట.ప్రస్తుతం కొరటాల శివ టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌.అందుకే ఆయన చెప్పినట్లుగా చిరంజీవి తగ్గాల్సిందేనని నిర్ణయించుకున్నాడు.అందుకోసం మరోసారి కేరళ వెళ్లే అవకాశం ఉంది.

ఆరు పదుల వయసులో చిరంజీవిని ఇంకా తగ్గమనడం ఏమాత్రం శ్రేయష్కరం కాదని అభిమానులు అంటున్నారు.చిరంజీవికి కొరటాల ఇచ్చిన టాస్క్‌పై అభిమానులు కూడా ఆగ్రహంతో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube