గత కొద్దికాలంగా ప్రపంచ దేశాల్లో అణు పరీక్షలకు ప్రసిద్ధిగాంచిన ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితులపై పలు కథనాలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.ఇందులో భాగంగా ఎక్కువగా ఇప్పటికే కిమ్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని తొందర్లోనే అతడు మరణించ బోతున్నాడని కొన్ని వార్తా పత్రికలు కూడా పలు వ్యాసాలు రాశాయి.
మరికొందరైతే ఏకంగా సోషల్ మీడియాలో ఇప్పటికే కిమ్ జోంగ్ ఉన్ మరణించాడని పలు వార్తలను తెగ వైరల్ చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఉత్తర కొరియా దేశానికి సంబంధించిన ఓ విషయం గురించి నెట్టింట్లో నెటిజన్లు బలంగా చర్చించుకుంటున్నారు.
అయితే ఇంతకీ ఆ విషయం ఏంటంటే ఒకవేళ ప్రస్తుత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరణిస్తే ఆ దేశ అధ్యక్ష పదవి పగ్గాలను ఎవరు చేపడతారని చర్చ బలంగా సాగుతోంది.ఇందులో కొందరు కిమ్ జోంగ్ ఉన్ మరణం తర్వాత ఆ దేశ అధ్యక్ష పదవి బాధ్యతలను అతని సోదరి కిమ్ యో జాంగ్ చేపట్టనున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే అందుకు గల కారణాలు లేకపోలేదు.గత కొద్ది సంవత్సరాలుగా వంశ పారపర్యంగా కిమ్ వంశస్థులు ఉత్తర కొరియాని పాలిస్తున్నారు.అంతేగాక ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ తో తన సోదరి కిమ్ యో జాంగ్ మంచి సన్నిహిత సంబంధాలు మరియు రాజకీయ అనుభవం కలిగి ఉండడంతో ఎక్కువ మంది కిమ్ యో జాంగ్, కిమ్ మరణాంతరం అధ్యక్ష పదవి పగ్గాలను చేపట్టాలని కోరుకుంటున్నారు.
అయితే ఆ దేశ ప్రజలు మాత్రం కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడెప్పుడు మరణిస్తాడా, అతడి నియంత పాలన ఎప్పుడెప్పుడు అంతమవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం.
కానీ ఉత్తర కొరియా దేశంలో కిమ్ జోంగ్ ఉన్ కి సరైన ప్రత్యర్థి లేకపోవడంతో ఇప్పటి వరకు ఆ దేశ ఎన్నికల్లో ఓటమి చవి చూడలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనప్పటికీ ఉత్తర కొరియా దేశ ప్రజలు మాత్రం కిమ్ జోంగ్ ఉన్ పాలనతో పూర్తిగా విసిగిపోయారని, అంతే గాక అతడి పాలనా చెరసాల నుంచి విముక్తి కోరుకుంటున్నారని ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీలు సరిగ్గా పావులు కదిపితే కచ్చితంగా దేశ అధ్యక్ష పదవి పగ్గాలను దక్కింకోవచ్చునని మరి కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.