ఇక బీజేపీని ప్రజల్లో దోషిగా నిలబెట్టడమే కెసీఆర్ టార్గెట్టా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.తెలంగాణ బలమైన ప్రతిపక్షం లేదన్న విషయం అందరికి తెలిసిందే.

 Is Kcr's Target To Blame The Bjp On The People?/telangana Politics, Bjp Party, T-TeluguStop.com

టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.అయితే బీజేపీ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకతను పెద్ద పెంచేందుకు కృషి చేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే బీజేపీకి అడ్డుకట్ట వేయడానికి కెసీఆర్ అవలంబించిన ఓపిక వ్యూహం బీజేపీని పెద్ద ఎత్తున ఇరకాటంలోకి నెట్టిందనే విషయం కాదనలేని సత్యం.

అయితే యాసంగి వరి ధాన్యం విషయంలో బండి సంజయ్ ను దోషిగా నిలబెట్టే విషయంలో కెసీఆర్ వంద శాతం విజయవంతమైన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు రైతులకు పరిహారం ప్రకటించి దేశ వ్యాప్తంగా బీజేపీని ఇరుకున పెట్టిన పరిస్థితి ఉంది.అయితే బీజేపీ నాయకులు రైతులకు పరిహారం ప్రకటించే విషయంలో ఇప్పటికె పలు రకాల వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలను కూడా ప్రజల ముందు ఎండగట్టే అవకాశం ఉంది.

Telugu @bjp4telangana, @cm_kcr, Bandi Sanjay, Bjp, Central, Farmmers, Paddy, Rev

దీంతో బీజేపీని శాశ్వతంగా ప్రజల ముందు దోషిగా నిలబెట్టే విధంగా తన కార్యాచరణను రూపొందించుకుంటున్నట్టు సమాచారం.అంతేకాక తెలంగాణలో బీజేపీకి అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో బీజేపీ అంటే వ్యతిరేక భావం వచ్చేలాగా ఒక బీజేపీపై ఒక ముద్ర వేస్తేగాని బీజేపీకి అడ్డుకట్ట వేయలేని పరిస్థితి ఉంటుంది.  అయితే బీజేపీ మాత్రం అధికారం టార్గెట్ గా పెట్టుకున్నా గాని గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకునే దిశగా పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.మరి రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కెసీఆర్ బీజేపీ పార్టీ కి అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube