జగన్ తీరుతో కేసీఆర్ బాగా ఇబ్బందిపడుతున్నాడా ?

ఏపీ, తెలంగాణ సీఎం లు ఇద్దరూ ఎంత మంచి మిత్రులో అందరికి బాగా తెలుసు.ఇరు రాష్ట్రాల కు సంబంధించి జటిలమైన సమస్యలను కూడా వీరిద్దరూ కలిసి పరిష్కరించుకున్నాడు.

 Is Kcr Well Trouble With Jagan-TeluguStop.com

ఇక వీరిద్దరి ఉమ్మడి శత్రువు కూడా టీడీపీ అధినేత చంద్రబాబే కావడంతో వీరిద్దరి మధ్య బంధం మరింత పెరగడానికి కారణం అయ్యింది.ఏపీలో జగన్ గెలుపొందేందుకు కేసీఆర్ కూడా పరోక్షంగా సహాయ సహకారాలు అందించాడు.

ఈ ఇద్దరి మిత్రుల స్నేహం పై ప్రశంసలు, విమర్శలు కూడా వస్తున్నాయి.అయితే ఇప్పుడు మాత్రం జగన్ తీరుతో కేసీఆర్ బాగా ఇబ్బందిపడుతున్నాడట.

ఏపీలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, ఉద్యోగాల భర్తీ, రైతు భరోసా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, అమ్మ ఒడి ఇలా చెప్పుకుంటూ పోతే ఐదేళ్ల సమయంలో తీరిగ్గా అమలు చేయాల్సిన పథకాలన్నీ జగన్ నాలుగు నెలల కాలంలోనే అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు.

Telugu Apcm, Apsrtc Ap, Kcr Well Jagan, Jagan, Kcrstrict, Telanganacm, Tsrtcempl

  అయితే అదే దూకుడు ఇప్పుడు జగన్ కు తీవ్ర ఇబ్బందులు తీసుకువస్తోంది.ఏపీలో జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పోల్చి చూపిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.ముఖ్యంగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలంగాణ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరగడానికి కూడా కారణం అవుతోంది.ప్రస్తుతం ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం దిశగా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది.దీంతో తమను కూాడా ప్రభుత్వంలో భాగం చెయ్యాలంటూ టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అయితే అందుకు సీఎం కేసీఆర్ ససేమేరా అనడంతో సమ్మెకు దిగారు.

Telugu Apcm, Apsrtc Ap, Kcr Well Jagan, Jagan, Kcrstrict, Telanganacm, Tsrtcempl

  మంతనాలు, చర్చలతో సమ్మె ముగుస్తుందని అంతా భావించగా ఈ సమ్మె చాలా సీరియస్‌గా మారింది.ఇద్దరి ఉద్యోగుల బలవన్మరణాలతో పరిస్థితి చేయి దాటింది.ప్రభుత్వం ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.ఇక మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా కమిటీని ఏర్పాటు చేసింది.

రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా మొత్తం ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది.ఇప్పటికే ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

విలీనం ప్రక్రియలో మిగిలిన అంశాలపై అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇవ్వనుంది.మొత్తం 9 అంశాలపై అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇస్తుంది.

ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుపై కూడా కమిటీ అవసరమైన సూచనలు చేయనుంది.శాశ్వత ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగుల జీతభత్యాలపై కమిటీ రిపోర్ట్ ఇస్తుంది.

విలీనం తర్వాత ఆర్టీసీ బిజినెస్ రూల్స్ లో మార్పులు రాకుండా తీసుకివాల్సిన చర్యలపై నివేదికను ఇవ్వనుంది.

రిటైర్డ్ ఉద్యోగుల జీతాలు,వైద్య సదుపాయలపై అధికారుల కమిటీ పరిశీలన చేస్తుందని ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వం లో విలీనం చేయడంలో ఉన్న ఆర్ధిక,న్యాయపరమైన అంశాలపై నివేదిక ఇవ్వనున్నారు.వచ్చే నెలాఖరుకల్లా నివేదిక ఇవ్వాలని కమిటీ కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న సమ్మె నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీని విలీనం చేసేందుకు జగన్ మరో ముందడుగు వేయడంతో కేసీఆర్ మరింత చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube