ఈట‌ల విష‌యంలో కేసీఆర్ మ‌ళ్లీ రాంగ్ స్టెప్ వేస్తున్నారా..?

రాజ‌కీయాల్లో ఎప్పుడైనా స‌రే ఒక విష‌యం బెడిసికొట్టింది అంటే మాత్రం దాన్ని మ‌ళ్లీ ముట్టుకోకూడ‌దు.ప‌దే ప‌దే అదే విష‌యాన్ని ఫాలో అయితే మాత్రం చివ‌ర‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు.

 Is Kcr Taking The Wrong Step Again In The Matter Of Etala ..?, Kcr, Eetala Rajen-TeluguStop.com

ఇప్పుడు కేసీఆర్ కూడా ఇలాంటి ప‌నే చేస్తున్నారు.గ‌తంలో ఈట‌ల రాజేంద‌ర్‌ను ఆయ‌న భూ క‌బ్జాలు చేశార‌నే ఆరోప‌ణ‌ల‌తో మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశారు.

చివ‌ర‌కు ఈ వివాదం కాస్తా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌కు దారి తీస్తే.దేశ వ్యాప్తంగా ఈ ఎన్నిక సంచ‌ల‌నంగా మారింది.

ఈ ఎన్నిక‌ల్లో ఈట‌ల‌కు విప‌రీత‌మైన సానుభూతి వ‌చ్చేసింది.కేసీఆర్ అన్యాయం చేశార‌నే విమ‌ర్శ‌లు బ‌లంగా వినిపించాయి.

చివ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్ గెల‌వ‌డం.టీఆర్ ఎస్ గ్రాఫ్ తీవ్రంగా ప‌డిపోవ‌డం కూడా మ‌నం చూశాం.

ఈట‌ల గెలుపుతో ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.చాలామంది నేత‌లు బీజేపీలోకి క్యూ క‌డుతున్నారు.

మొత్తంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం ఆ పార్టీకే ఇబ్బందులు తెచ్చింది.ఇన్ని ప‌రిస్థితుల న‌డుమ ఇప్పుడు మ‌ళ్లీ ఈట‌ల విష‌యంలో అధికారులు ఆరోపణలు చేయటం సంచ‌ల‌నంగా మారింది.

ఈట‌ల క‌బ్జా చేసింది నిజ‌మే అని 70 ఎకరాల వ‌ర‌కు అసైన్డు ల్యాండ్‌ను ఆయ‌న క‌బ్జా చేశారంటూ మెదక్ కలెక్టర్ చెప్ప‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

Telugu Bandi Sanjay, Bjp, Eetala Rajendar, Huzurabad, Trs-Telugu Political News

అయితే ఈట‌ల రాజేంద‌ర్ విష‌యంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణ‌యం క‌రెక్టు కాదంటూ ఇప్ప‌టికే కోర్టు కూడా చెప్పింది.అప్ప‌టిక‌ప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా విచార‌ణ చేశార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.మ‌రి ఈ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సింది పోయి మ‌ళ్లీ వివాదాన్ని రాజేయాల‌ని చూస్తే చివ‌ర‌కు టీఆర్ ఎస్‌కే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు.

ఎందుకంటే ఈట‌ల రాజేంద‌ర్ త‌మ మీద సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.ఇంకోవైపు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన క‌లెక్ట‌ర్ మీద కేసు పెడ‌తామంటూ కూడా చెప్ప‌డాన్ని బ‌ట్టి చూస్తుంటే కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఆయ‌న‌కే ఇబ్బందులు తెస్తున్నాయ‌ని వెల్ల‌డిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube