కేసీఆర్ రిట‌ర్న్ గిప్ట్ వ‌ల‌లో టీడీపీ సీనియ‌ర్లు..!

తెలంగాణా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీ సీఎం, టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు వేలు పెట్ట‌డంపై తీవ్రంగా స్పందించిన ఆ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.బాబును వ‌దిలి పెట్టే ప్ర‌శ్న‌లేద‌ని, మా రాష్ట్రంలో వేలు పెట్టిన‌ప్పుడు మేం కూడా ఏపీ రాజ‌కీయాల్లో వేలుపెడ‌తామ‌ని అన్నారు.

 Is Kcr Return Gift Started In Ap Tdp-TeluguStop.com

అంతేకాదు, చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టిం చారు.మ‌రో రెండు మూడు మాసాల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు గ‌ట్టిగా చెక్ పెట్టి వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను గెలిపించేందుకు కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని అప్ప‌ట్లోనే వార్త‌లు వ‌చ్చాయి.

ఈ రిట‌ర్న్ గిఫ్ట్‌పై అటు టీడీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది.ఇక‌, ప్ర‌జ‌ల్లోనూ ఈ గిఫ్ట్‌పై ఆస‌క్తి పెరిగింది.

కేసీఆర్ ఎలాంటి గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నార‌నే చ‌ర్చ ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల రాష్ట్రంలోని ప‌లుచోట్ల జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఇక‌, కేసీఆర్ త‌న రిట‌ర్న్ గిఫ్ట్‌ను ఇవ్వ‌డం ప్రారం భించేశారా? అనే సందేహాల‌ను తెర‌మీదికి తెచ్చింది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్థితిలోనూ వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను అధికారంలోకి తీసుకు వ‌చ్చేందుకు తెర‌చాటున కేసీఆర్ ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.ఈ నేప‌థ్యం లోనే తెలంగాణా ఎన్నిక‌ల్లో గెలిచిన ప‌లు సామాజిక వ‌ర్గాలకు చెందిన(అంటే ఏపీలో ఆయా సామాజిక వ‌ర్గాలు బ‌లంగా ఉన్న నాయ‌కుల‌ను) నాయ‌కుల‌ను ఏపీకి పంపించింది.

ఏదో ఒక కార‌ణంగా ఏపీలో కులాల మ‌ధ్య చీలిక‌లు తెచ్చి.త‌ద్వారా అధికార పార్టీని దెబ్బ‌కొట్టాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు దీనికి బ‌లాన్నిస్తున్నాయి.

విష‌యంలోకి వెళ్తే.

తెలంగాణాలో కేసీఆర్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఏపీలోని చాలా జిల్లాల్లో వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు పండ‌గ చేసుకున్నారు.ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌లో వెల‌మ సామాజివ‌క‌వ‌ర్గానికి చెందిన వారి పేర్ల‌తో ఫ్లెక్సీలు కూడా ఏర్పాట‌య్యాయి.

దీని వెన‌క వైసీపీ హ‌స్తం ఉంద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే.ఇక‌, తాజాగా గుంటూరు జిల్లా గుర‌జాల నియోక‌వ‌ర్గంలోని ప‌ల్నా డులోని దాచేప‌ల్లిలో అక్క‌డి వైసీపీ రాష్ట్ర నాయ‌కుడు జంగా కృష్ణ‌మూర్తి కుమారుడు ఏకంగా తెలంగాణాలో గెలిచిన యా ద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేను ఇక్క‌డికి తీసుకు వ‌చ్చి భారీ ఎత్తున స‌న్మానం చేయించారు.

ఈ సం ద‌ర్భంగా ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా యాద‌వుల్లో చీలిక తెచ్చి.వారిని వైసీపీకి అనుకూ లంగా మార్చాల‌నే ప్ర‌య‌త్నం చేశారు.

అదేవిధంగా క‌మ్మ సంఘంలో కీల‌కంగా ఉంటూ.హైద‌రాబాద్‌లోని శేరిలింగం ప‌ల్లి నుంచి రెండోసారి గెలిచిన అరికె పూడి గాంధీ కూడా ఇటీవ‌ల ఏపీకి వ‌చ్చారు.

ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న ప‌ర్య‌టించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న కూడా టీడీపీలోని క‌మ్మ వ‌ర్గంలో చీలిక తెచ్చేందుకు విఫ‌ల‌య‌త్నం చేశారు.

టీడీపీలో ఉంటే ఏమీ రాదు.వైసీపీకి అనుకూలంగా మారాల‌ని బోధించారు.

ఇలా ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నం మాత్రం స‌క్సెస్ అయినా.నేత‌ల్లో మాత్రం మార్పు క‌నిపించ‌లేదు.

ఇక‌, ఇప్పుడు తాజాగా హైద‌రాబాద్‌లోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం కూక‌ట్‌ప‌ల్లి నుంచి గెలిచిన వెలమ సామాజిక వ‌ర్గానికి చెందిన మాధ‌వ‌రం కృష్ణారావు.ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు వ‌చ్చారు.

చిన్న‌తిరుప‌తిగా గుర్తింపు పొందిన ద్వార‌కా తిరుమ‌ల క్షేత్రాన్ని ఆయ‌న‌ద‌ర్శించుకున్నారు.అయితే, ఇక్క‌డే అస‌లు సిస‌లు రాజ‌కీయం మొద‌లైంది.ఒక‌ప‌క్క టీడీపీకి-టీఆర్ ఎస్ కు మ‌ధ్య తీవ్ర మైన ఫైట్ జ‌రుగుతున్నా కూడా లెక్క‌చేయ‌కుండా ఇక్కడ రాజ‌కీయం చోటు చేసుకుంది.కూక‌ట్‌ప‌ల్లిలో టీడీపీని ఓడించేందుకు కేసీఆర్‌, మాధ‌వ‌రం కృష్ణారావు గ్యాంగ్ ఎంత‌కైనా తెగించింది.

చివ‌ర‌కు అక్క‌డ సుహాసిని త‌ర‌పున ప్ర‌చారం చేసేందుకు వెళ్లిన వారిపై దాడుల‌కు సైతం తెగ‌బ‌డింది.అయితే ఇవ‌న్నీ ఏపీలో టీడీపీ సీనియ‌ర్ల‌కు ప‌ట్ట‌లేదు.

వాళ్ల‌కు పార్టీ ముఖ్యం కాద‌ని తేల్చిచెప్పేశారు.తాజాగా కృష్ణారావు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ద్వార‌కాతిరుమ‌ల పుణ్య‌క్షేత్రం (చిన్న తిరుప‌తి)కి వ‌స్తే గోపాల‌పురం ఎమ్మెల్యే ముప్పిడి వెంక‌టేశ్వ‌ర‌రావు ముఖ్య అనుచ‌రుడు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా టీడీపీ కార్య‌ద‌ర్శి చెలికాని సోంబాబు వెళ్లి స్వాగ‌తం ప‌లికి ఆయ‌నే స్వ‌యంగా ద‌గ్గ‌రుండి పూజ‌లు చేయించ‌డం, మాధ‌వ‌రం కూర్చుని పూజ‌లు చేసుకుంటుంటే.

సోంబాబు ఏకంగా ఆయ‌న‌కు అంగ‌ర‌క్షుడిగా వెన‌కాలే నిల‌బ‌డి ఉండ‌డం వంటి ప‌రిణామాలు రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించాయి.

వాస్త‌వానికి చెలికాని రాజ‌బాబు అనే వ్య‌క్తి టీడీపీలో ఉండి వైసీపీలోకి జంప్ చేశాడు కాబ‌ట్టి ఆయ‌న వెళ్లి కృష్ణారావుకు స్వాగ‌తం ప‌లికాడంటే అర్ధం చేసుకోవ‌చ్చు.ఎందుకంటే వారిద్ద‌రి కుమ్మ‌క్కు రాజ‌కీయం అంద‌రికి తెలిసిందే.
కానీ, ఒక‌ప‌క్క‌, చంద్ర‌బాబును ఓడించి తీరుతాన‌ని, రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌ని వ్యాఖ్య‌లు చేసిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత‌కు ఇప్పుడు ఇలా టీడీపికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, జిల్లాకు బాధ్యుడిగా ఉన్న సోంబాబు ఇలా స్వాగ‌తం చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది.

టీడీపీని, ఆ పార్టీ అధినేత‌ను మాధ‌వ‌రం తీవ్ర‌స్థాయిలో తిట్టారు.అలాంటి త‌రుణంలో ఇలా సోంబాబు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌క‌న్నా ఘోరంగా వ్య‌వ‌హ‌రించ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.టీడీపీలో చెలికాని సోంబాబు వైసీపీ నాయ‌కుడితో క‌లిసి స్వాగ‌తం ప‌ల‌క‌డం మ‌రింత దారుణంగా మారింది.

దీన్ని బ‌ట్టి.

సోంబాబు విష‌యంలో పార్టీలు ముఖ్యం కాద‌నేది స్ప‌ష్ట‌మైంది.అదే స‌మ‌యంలో మాధ‌వ‌రంతో చ‌ర్చ‌లు కూడా నిర్వ‌హించ‌డంపై సోంబాబును స్థానిక టీడీపీ నేత‌లే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

పార్టీ నియ‌మాల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించ‌డం, అధినేత చంద్ర‌బాబును తిట్టిపోసిన పార్టీకి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించ‌డంపై నిప్పులు చెరుగుతున్నారు.అంత ప్రేమ ఉంటే పార్టీని విడిచి పెట్టి వెళ్లొచ్చ‌ని, పార్టీలో ఉప్పు తింటూ.

పార్టీకి ద్రోహం చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని ఇక్క‌డి నాయ‌కులు దుయ్య‌బ‌డుతున్నారు.టీఆర్ఎస్ పార్టీ ఏపీలో టీడీపీని బ‌ద్నాం చేయ‌డానికి వేస్తోన్న ఎత్తుల్లో ఇక్క‌డ సోంబాబు లాంటి సీనియ‌ర్లు ప‌డ‌డాన్ని ఆ పార్టీ వాళ్లే జీర్ణించుకోలేక‌పోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube