బీజేపీకి ఆ విషయంలో కేసీఆర్ భయం పట్టుకుందా?

తెలంగాణ రాజకీయాలు అధికార పక్షం, ప్రతిపక్షాల మాటల తూటాలతో హీటెక్కుతున్న పరిస్థితి ఉంది.అయితే టీఆర్ఎస్  తరువాత బీజేపీ, కాంగ్రెస్ లు రెండో ప్రత్యామ్నాయ స్థానం కోసం పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.

 Is Kcr Afraid Of Bjp In That Regard, Kcr, Bjp Party-TeluguStop.com

అయితే గత రెండో  సార్వత్రిక ఎన్నికల వరకు ఇటు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లు రెండూ కూడా రాష్ట్రంలో అంతగా బలంగా లేని పరిస్థితి ఉంది.అందుకే రెండు సార్లు ఎటువంటి బలమైన ప్రత్యర్థులు లేకుండానే ఎన్నికల బరిలోకి దిగిన కెసీఆర్ కు విజయం చాలా సునాయాసంగా వచ్చింది.

అయితే ప్రస్తుత పరిస్థితి మాత్రం కేసీఆర్ కు ఛాలెంజింగ్ గా ఉందనేది కాదనలేని సత్యం.ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లు ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండాగా ముందుకుపోతున్న పరిస్థితి ఉంది.

అయితే ప్రజలు ప్రతిపక్షాల విమర్శలపై కొద్దిగా దృష్టి పెట్టడంతో కెసీఆర్ కొంత అలర్ట్ అయిన పరిస్థితి ఉంది.అయితే ప్రజల నాడి ప్రస్పుఠంగా తెలిసిన కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి వ్యూహంతో తనకనుగుణంగా పరిస్థితులను మార్చేస్తాడనేది ఎవ్వరూ ఊహించడం చాలా కష్టం.

అందుకే కేసీఆర్ పట్ల బీజేపీకి భయం పట్టుకుంది.ప్రస్తుతం బీజేపీ తమదైన రాజకీయాన్ని తెలంగాణలో ఇప్పటికే మొదలుపెట్టింది.అయితే తాజాగా బండి సంజయ్ హిందువుల పక్షాన మాత్రమే బీజేపీ ఉంటుందని బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం బీజేపీ పై ఎలాంటి కామెంట్స్ చేయకున్నా అవసరం అయిన సమయంలో బీజేపీ సిద్దాంతాలపై, వారి రాజకీయ విధానంపై సరియైన సమయంలో స్పందించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఏది ఏమైనా బీజేపీ మాత్రం కేసీఆర్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశ్యంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube