కెసిఆర్ పిరికోడా ?

పూర్వపు రోజుల్లో ఒక వీరుడు మరో వీరుడితే తలపడి బలబలాలు తేల్చుకోవాలనుకుంటే, అవతలి వ్యక్తికి ఆయుధం అందించి మరీ పోరాడేవాడు.అదీ నిజమైన పౌరుషం, ధీరత్వమంటే.

 Is Kcr Afraid ?-TeluguStop.com

ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ మరో పార్టీ ఎన్నికల్లో పోరాడాలే తప్ప పోటీ చేయకూడదని అనకూడదు.రాజ్యాంగం ప్రకారం అది నేరమే కాకుండా, వ్యక్తిగతంగా పిరికితనమని కూడా చెప్పొచ్చు.

పొడుగు పొడుగు మాటలు మాట్లాడే కేసీఆర్‌ టీడీపీని సవాల్‌ చేయాలిగాని నువ్వు పోటీ చేయకూడదంటూ అన్నారంటే అది బేలతనమేనని చెప్పొచ్చు.

టీడీపీకి తెలంగాణలో బలం లేదని, నగరంలో దానికి దిక్కు లేదని టీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తోంది.

మరి బలహీనమైన పార్టీ పోటీ చేసినందువల్ల టీఆర్‌ఎస్‌కు ఏం నష్టం జరుగుతుంది? పైకి టీడీపీని బలహీనమైన పార్టీ అని చెబుతున్నా అది (బీజేపీ-టీడీపీ కూటమి) గణనీయమైన స్థానాలు సంపాదిస్తుందనే భయం కేసీఆర్‌కు ఉన్నట్లుంది.హైదరాబాదులో లక్షలాది మంది సీమాంధ్రులు అంటే సెటిలర్స్‌ ఉన్నారు కాబట్టి వారి ఓట్లు కూటమికి పడతాయని అనుకుంటున్నారు.

పోటీ చేయడం, ఓట్లు అడగడం చిల్లర రాజకీయం ఎలా అవుతుందో కేసీఆర్‌ చెప్పాలి.ఎన్నికల్లో పోటీ చేయడమంటే మత కలహాలు సృష్టించడం కాదు.బాంబులు వేయడం కాదు.అన్నదమ్ముల్లా కలిసున్నవారిని వేరు చేయడం కాదు.

దాదాపు ముప్పయ్‌ లక్షలమంది సీమాంధ్రులు కట్టకట్టుకొని టీడీపీకి ఓట్లేయరు.ఓట్లేసినవారిని టీడీపీ ఆంధ్రాకు పట్టుకెళ్లదు.

టీడీపీ ఇప్పుడు జాతీయ పార్టీగా మారింది.ఒక్క హైదరాబాదులోనే కాదు.

దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు.ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడే పాండిచ్చేరి, లక్ష దీవుల్లో, మరికొన్ని చోట్ల పోటీ చేసింది.

హైదరాబాదు పార్టీగా పేరున్న ఎంఐఎం మహారాష్ట్రలో, బిహార్‌లో పోటీ చేసింది కదా.మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెల్చుకుంది కూడా.టీఆర్‌ఎస్‌ ఆంధ్రాలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు.కాదనేందుకు చంద్రబాబుకు హక్కు లేదు.

టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను అభిమానించేవారు అక్కడా ఉన్నారు.కాంగ్రెసు, బీజేపీ జాతీయ పార్టీలైనా దక్షిణాది రాష్ట్రాల్లో కొందరు వాటిని ఉత్తరాది పార్టీలంటారు.

అంతమాత్రాన పోటీ చేయకుండా నిలువరించడంలేదు కదా.ఎన్నికల ప్రచారంలో ఎవరి ప్రచారం వారు చేసుకుంటున్నారు.ఎవరి గొప్పలు వారు చెప్పుకుంటున్నారు.ఎవరి మేనిఫెస్టోలతో వారు ప్రజలను మభ్య పెడుతున్నారు.అంతా విన్న ప్రజలు ఎవరు తమకు మేలు చేస్తారని నమ్ముతారో వారిని గెలిపిస్తారు.కేసీఆర్‌గాని, ఆయన పార్టీ నాయకులుగాని టీడీపీని విమర్శించవచ్చు.

దాని సిద్ధాంతాలను దుయ్యబట్టవచ్చు.అంతే తప్ప తెలంగాణలో మీకేం పని? ఇక్కడ పోటీ చేయడానికి వీల్లేదు అనే హక్కు లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube