ఇండియాలో మరీ ఇంత ఎక్కువ పారితోషికం ఇస్తారా... స్టార్‌ హీరోలు సైతం కుళ్లుకునేలా కంగనాకు పారితోషికం  

Is Kangana Ranaut Charging Rs 24 Crore For Jayalalitha Biopic-kangana Ranaut Remuneration,rs 24 Crore

సౌత్‌లో స్టార్‌ హీరోలు ఈమద్య కాలంలో సినిమాల లాభాల్లో వాటాలను పారితోషికంగా తీసుకుంటున్నారు. అయితే హీరోయిన్స్‌కు మాత్రం కోటి లేదా రెండు కోట్లు. అంతుకు మించి సౌత్‌లో ఏ నిర్మాత కూడా తమ సినిమాలో హీరోయిన్‌కు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు..

ఇండియాలో మరీ ఇంత ఎక్కువ పారితోషికం ఇస్తారా... స్టార్‌ హీరోలు సైతం కుళ్లుకునేలా కంగనాకు పారితోషికం-Is Kangana Ranaut Charging Rs 24 Crore For Jayalalitha Biopic

ఎంత కష్టపడ్డా కూడా సౌత్‌ హీరోయిన్స్‌ అయిదు పది కోట్లను అందుకోవడం అనేది దాదాపు అసాధ్యం అంటున్నారు. ఇలాంటి సమయంలో ఒక సౌత్‌ సినిమా కోసం హీరోయిన్‌ దాదాపు 24 కోట్ల పారితోషికం తీసుకునేందుకు సిద్దం అయ్యింది.

తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విజయ్‌ దర్శకత్వంలో జయలలిత బయోపిక్‌ రూపొందబోతుంది. ఆ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ జయలలిత పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే.

ఇటీవలే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో నటించేందుకు గాను కంగనా రనౌత్‌ ఏకంగా 24 కోట్ల పారితోషికం తీసుకోబోతుంది. బాలీవుడ్‌లో కంగనాను మించిన టాప్‌ హీరోయిన్స్‌ ఉన్నారు. వారు కూడా పది నుండి పదిహేను కోట్ల పారితోషికంను మాత్రమే తీసుకుంటున్నారు.

కంగనా మాత్రం ఏకంగా పాతిక కోట్ల పారితోషికం తీసుకోవడం అనేది చర్చనీయాంశంగా ఉంది. పెద్ద ఎత్తున సినిమాలు చేయకపోయినా కూడా కంగనాకు ఫైర్‌ బ్రాండ్‌ అనే ఇమేజ్‌ ఏర్పడింది. దాంతో ఈ అమ్మడిని జయలలిత బయోపిక్‌లో నటింపజేయాలని భావిస్తున్నారు. అంత భారీపారితోషికం అయినా కూడా ఆమె వల్ల బాలీవుడ్‌లో సినిమాకు క్రేజ్‌ వస్తుంది.

ఆమె పారితోషికం హిందీ ప్రేక్షకుల ద్వారా వస్తుంది, ఇక సౌత్‌ భాషల్లో వచ్చే కలెక్షన్స్‌ నిర్మాతకు లాభాలుగా చెప్పుకుంటున్నారు.