హీరోయిన్లకు పెళ్లి అయ్యిందంటే.వారి సినీ కెరీర్ కు బ్రేక్ పడేది.
చాలా మంది సినీ తారల జీవితాలూ అంతే.పెళ్లయ్యిందంటే ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి.
ఎంచక్కా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేసేవారు.కానీ సమంతా, కాజల్ అగర్వాల్ విషయంలో మాత్రం సీన్ పూర్తి రివర్స్ గా ఉంది.
వారికి పెళ్లి ముందు కంటే పెళ్లి తర్వాతే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.సినిమా పరిశ్రమలో ఒకప్పుడు ఓ ఆనవాయితీ ఉండేది.
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత కెరీర్ మరింత సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది నాగార్జున మాజీ కోడలు.
అటు పలువురు స్టార్ హీరోల నుంచి ఆఫర్లు అందుకుంటుంది.
అటు క్యూట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కూడా ఇదే పద్దతిలో కొనసాగుతుంది.
కొంత కాలం క్రితం వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.పెళ్లి తర్వాత మరిన్ని అవకాశాలను చేజిక్కించుకుంటుంది.తాజాగా నాగార్జున, ప్రవీణ్ సత్తారు సినిమాలో వేశ్య క్యారెక్టర్ చేస్తూ సంచలనం కలిగిస్తుంది.అటు ఆచార్య సినిమాతో పాటు మరో మూడు సినిమాలకు ఓకే చెప్పింది.అయితే తను కొన్ని కండీషన్లు పెడుతుందట.

అదేంటటే.తనతో పాటు తన భర్త గౌతమ్ కు కూడా సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలని కోరుతుందట.తను నటించే సినిమాల్లో తన భర్తకు కూడా క్యారెక్టర్ ఇవ్వలంటుందట.అలా అయితేనే సినిమాలు చేస్తానని చెప్తుందట.పాత్ర ఎంత లెన్తీగా ఉంటుంది అనేది పక్కన పెడితే.తనకు మాత్రం క్యారెక్టర్ ఇవ్వాలని కోరుతుందట.
తన భర్తను స్ర్కీన్ మీద చూసుకోవాలనే కాజల్ ఈ కండీషన్ పెడుతుందని సినీ జనాలు భావిస్తున్నారు.ఒకేవేళ ఆమె కండీషన్ కు దర్శక నిర్మాతలు ఓకే చెప్తారేమో చూడాలి.
ఒకవేళ ఓకే చెప్తే.భార్యా భర్తలు వెండి తెరపై ఎలా కనిపిస్తారో చూడాలి.